ఎంఐఎం సీనియర్ నేత, చాంద్రాయణ గుట్ట ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ ఆరోగ్య కారణాల రీత్యా లండన్‌లో చికిత్స పొందుతున్నారు. 2011 ఏప్రిల్ 30వ తేదీన చాంద్రాయణగుట్ట కేశవగిరిలోని బార్కాస్-బాలాపూర్ రోడ్‌లో హత్యాయత్నం జరిగింది.

ఈ దాడి నుంచి ఆయన తృటిలో ప్రాణాలతో బయటపడినా.. తీవ్ర గాయాలు పాలవ్వడంతో ఇప్పటికీ చికిత్స పొందుతున్నారు. ఈ నేపథ్యంలో అక్బరుద్దీన్ అస్వస్థతకు గురికావడంతో మెరుగైన చికిత్స కోసం ఆయనను లండన్‌లోని ఆస్పత్రికి తరలించారు.

మరోవైపు సోదరుడు అక్బరుద్దీన్ త్వరగా కోలుకోవాలంటూ దేవుడిని ప్రార్ధించాలని ఎంఐఎం అధినేత, హైదరాబాద్‌ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ పార్టీ శ్రేణులు, అభిమానులను కోరారు.