హైదరాబాద్: ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలోని ఇబ్రహీంపట్నం అసెంబ్లీ నియోజకవర్గంలోని ఆదిభట్ల మున్సిపల్ ఛైర్మెన్ టీఆర్ఎస్ కు గుడ్ బై చెప్పారు. సోమవారం నాడు ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరారు.

చాలా కాలంగా  పార్టీ  నాయకత్వంపై  మున్సిపల్ ఛైర్మెన్ అసంతృప్తితో ఉన్నారు.  టీఆర్ఎస్ నాయకత్వంపై అసంతృప్తితో ఉన్న విషయాన్ని తెలుసుకొన్న కాంగ్రెస్ నాయకత్వం ఆయనకు వల వేసింది. కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

సోమవారం నాడు భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సమక్షంలో ఆదిభట్ల మున్సిపల్ చైర్మెన్ ప్రవీణ్ గౌడ్  కాంగ్రెస్ లో చేరారు.

కాంగ్రెస్ పార్టీలో గతంలో పనిచేసిన ప్రవీణ్ గౌడ్ ఎన్నికల సమయంలో టీఆర్ఎస్ లో చేరారు.  ఎన్నికలు ముగిసిన తర్వాత టీఆర్ఎస్ నాయకత్వం తనకు ప్రాధాన్యత ఇవ్వని కారణంగా ప్రవీణ్ టీఆర్ఎస్ కు గుడ్ బై చెప్పారు. 

దుబ్బాక, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో  కాంగ్రెస్ పార్టీ ఘోర పరాజయం పాలైంది. టీపీసీసీ చీఫ్ పదవికి కొత్త నేతను ఎంపిక చేసేందుకు నాయకత్వం కసరత్తు చేస్తోంది.