తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలకు కౌంటింగ్ ఈ రోజు ఉదయం ప్రారంభం అయ్యాయి. సాయంత్రానికి ఎవరు గెలుస్తారో క్లారిటీ రానుంది. అయితే.. గెలిచిన వారు విజయోత్సవ ర్యాలీలు చేసుకోవడానికి అనుమతి లేదంటున్నారు అడిషనల్ డీజీపీ జితేంద్ర. ఈ మేరకు ఆయన కీలక ప్రకటన కూడా చేశారు. 

పోలింగ్ సమయంలో తాండూర్ కాంగ్రెస్ అభ్యర్థి రోహిత్ రెడ్డి, కల్వకుర్తి అభ్యర్థి వంశీచంద్ రెడ్డిలపై ప్రత్యర్థులు దాడి చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో వారికి అదనపు భద్రత కల్పించాలని కాంగ్రెస్ మాజీ ఎంపీ మధుయాష్కీ.. డీజీపీని కోరారు. కాగా.. వారి కోరిక మేరకు ప్రత్యేక భద్రత కల్పించిటన్లు చెప్పారు. కౌటింగ్ కేంద్రాల వద్ద 144 సెక్షన్ ని అమలు చేస్తున్నట్లు చెప్పారు.అంతేకాకుండా సాయుధ పారామిలిటరీ బలగాలను కూడా నియమించినట్లు జితేంద్ర వివరించారు.