హైదరాబాద్: సినీ నటుడు శివాజీ  హైకోర్టులో  క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. బుధవారం నాడు ఈ పిటిషన్‌పై హైకోర్టు విచారణ చేయనుంది.తనను పోలీసులు అరెస్ట్ చేయకుండా స్టే ఇవ్వాలని  ఆ పిటిషన్‌లో కోరారు. 

టీవీ 9 వివాదం విషయంలో అలంద మీడియా సంస్థ రవిప్రకాష్‌పై ఫిర్యాదు చేసింది.ఈ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. అయితే  ఈ కేసు విషయంలో  తమ ముందు హాజరుకావాలని పోలీసులు సినీ నటుడు శివాజీకి నోటీసులు జారీ చేశారు.

శివాజీ మాత్రం పోలీసుల ముందు హాజరుకాలేదు.రవిప్రకాష్ ఈ కేసులో ఇప్పటికే పోలీసుల విచారణకు హాజరయ్యారు. మరో వైపు శివాజీ  మాత్రం పోలీసుల విచారణకు హాజరుకాలేదు. 

ఈ విషయమై నటుడు శివాజీ హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు.  తనపై సైబర్ క్రైమ్ పోలీసులు నమోదు చేసిన కేసును కొట్టేయాలని ఆ పిటిషన్‌లో కోరారు.అంతేకాదు తనను అరెస్ట్ చేయకుండా స్టే  విధించాలని కూడ కోరారు. ఈ పిటిషన్‌పై ఇవాళ హైకోర్టులో విచారణ జరగనుంది.