బుల్లితెర నటి  ఝాన్సీ ఆత్మహత్య దర్యాప్తు ను పోలీసులు వేగవంతం చేశారు. ఈ కేసులో ఝాన్సీ రెండు ఫోన్ లను  పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.వీటిలో ఒక ఫోన్‌ లాక్‌ ఓపెన్‌ కాగా అందులో ఉన్న మెసేజ్‌ల్లో కొన్ని ఆమె ప్రియుడు సూర్య తేజకు పంపి తిరిగి డిలీట్‌ చేసినట్లు గుర్తించారు. డిలీట్‌ చేసిన మెసేజ్‌లను సాంకేతిక పరిజ్ఞానం ద్వారా తిరిగి అందుబాటులోకి తెచ్చేందుకు పంజగుట్ట పోలీసులు ప్రయత్నిస్తున్నారు.

మరో ఐ ఫోన్‌ లాక్‌ ఎంత ప్రయత్నించినా తెరుచుకోవడంలేదని పోలీసులు గురువారం తెలిపారు. కాగా లాక్‌ ఓపెన్‌ అయిన ఫోన్‌లో పెద్దగా సమాచారం లేదు. ఝాన్సీ అన్న దుర్గాప్రసాద్‌ ఇచ్చిన ఫిర్యాదులో సూర్య వేధింపుల వల్లే ఝాన్సీ ఆత్మహత్య చేసుకుందని ఉండగా పోలీసులకు సరైన ఆధారాలు లభించలేదు. దీంతో ఇప్పటివరకు సూర్యపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు. 

అయినప్పటికీ సూర్య ప్రస్తుతం పరారీలో ఉన్నాడు. ఇదిలా ఉంటే.. ఆమె రెండో ఫోన్ ఐఫోన్ లాక్ చేస్తే తప్ప.. ఆమె ఆత్మహత్యకు గల కారణాలు తెలియరావని పోలీసులు అభిప్రాయపడుతున్నారు. కాగా.. గత నెలలో కూడా ఒకసారి ఝాన్సీ ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది.