సెల్ ఫోన్ దొంగిలించాడని అనుమానం.. కర్రలతో కొట్టి యువకుడి దారుణ హత్య.. ఆదిలాబాద్ లో ఘటన
ఓ యువకుడు సెల్ ఫోన్ దొంగిలించాడని అతడి స్నేహితులే అనుమానించారు. ఓ అటవీ ప్రాంతానికి తీసుకెళ్లి దారుణంగా కర్రలతో కొట్టారు. ఈ దెబ్బలు తాళలేక యువకుడు మరణించాడు. ఈ ఘటన ఆదిలాబాద్ జిల్లాలో జరిగింది.
సెల్ ఫోన్ దొంగిలించాడనే అనుమానం ఓ యువకుడి ప్రాణం పోయేలా చేసింది. ఆ యువకుడిని మరో నలుగురు కలిసి దారుణంగా కర్రలతో కొట్టి హతమార్చారు. ఈ ఘటన ఆదిలాబాద్ జిల్లాలో చోటు చేసుకుంది. ఇది జిల్లా వ్యాప్తంగా సంచలనం రేకెత్తించింది. పోలీసులు తెలిపిన ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి.
రాకాసి అల ఎంత పని చేసింది.. సముద్రంలో కొట్టుకుపోయి విద్యార్థిని మృతి
ఆదిలాబాద్ జిల్లా బేల మండలం భవానీగూడ (ఈ) గ్రామంలో 25 ఏళ్ల కొడప జీవన్ ట్రాక్టర్ డ్రైవర్ గా, అలాగే అప్పుడుప్పుడు కూలి పనులకు కూడా వెళ్తూ జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలో అతడి స్నేహితుల్లో ఒకరి సెల్ ఫోన్ ఇటీవల దొంగతనానికి గురైంది. అది కనిపించడం లేదు. దీంతో జీవన్ పై అనుమానం వచ్చింది. అతడే దానిని దొంగతనం చేసి ఉంటాడనే భావించి ఇదే జిల్లాలోని బోరిగాంకు చెందిన లింగ్ షావ్, అలాగే దుబ్బగూడ గ్రామానికి చెందిన భీంరావులు ఇద్దరు కలిసి ఆదివారం కొడప జీవన్ నివాసానికి సాయంత్రం సమయంలో వచ్చారు.
corona virus: కోవిడ్-19 కొత్త వేరియంట్లపై చర్చించేందుకు కేంద్రం ఉన్నతస్థాయి సమావేశం
కూలి ఉందని అతడికి చెప్పారు. దీంతో అతడు వారి బైక్ పై ఎక్కాడు. వారిద్దరూ అతడిని మశాల, దుబ్బగూడ గ్రామాల మధ్య ఉన్న అడవి ప్రాంతానికి తీసుకొని వెళ్లారు. అయితే అప్పటికే బోరిగాం గ్రామానికి చెందిన దేవ్ షావ్, శ్రీనివాస్ అనే యువకులు ఆ ప్రాంతంలో వేచి ఉన్నారు. ఈ క్రమంలో వీరు నలుగురు జీవన్ ను దారునంగా కర్రలతో కొట్టారు. ఈ దెబ్బలు తాళలేక జీవన్ చనిపోయాడు. ఈ ఘటనపై మృతుడి సోదరుడు విజయ్ కు కంప్లైంట్ ఇచ్చాడు. సెల్ ఫోన్ దొంగించాడనే అనుమానంతో తన సోదరుడుని నలుగురు హతమార్చాడని అందులో పేర్కొన్నాడు.