మాజీ మంత్రి నారాయణ కూతురు నివాసంలో ఏపీ సీఐడీ సోదాలు
ఏపీ మాజీ మంత్రి నారాయణ కూతురు నివాసంలో ఏపీ సీఐడీ అధికారులు ఇవాళ సోదాలు నిర్వహిస్తున్నారు.
హైదరాబాద్: ఏపీ రాష్ట్రానికి చెందిన మాజీ మంత్రి పి. నారాయణ, ఆయన కూతురు నివాసంలో శుక్రవారం నాడు ఏపీ సీఐడీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. హైద్రాబాద్ మాదాపూర్‌లోని నివాసంలో తనిఖీలు చేస్తున్నారు.
అమరావతి భూముల కొనుగోలు కేసులో ఏపీ సీఐడీ అధికారులు సోదాలు చేస్తున్నారు. మాజీ మంత్రి నారాయణతో పాటు ఆయన కూతురు ఇళ్లలో సోదాలు చేస్తున్నారు. హైద్రాబాద్ నగరంలో ఉన్న మరో రెండు ఇళ్లలో కూడా సోదాలు సాగుతున్నాయి. గతంలో రెండు దఫాలు ఏపీ సీఐడీ అధికారులు సోదాలు చేస్తున్నారు.హైద్రాబాద్ నగరంలోని ఐదు ప్రాంతాల్లో సోదాలు జరుగుతున్నాయి. మాదాపూర్, గచ్చిబౌలి , కూకట్ పల్లిలో ఏపీ సీఐడీ అధికారులు సోదాలు చేస్తున్నారు.