వరంగల్: వరంగల్ జిల్లాలో దారుణం చోటు చేసుకొంది. 9 మాసాల చిన్నారిపై అత్యాచారం చేసి హత్య చేశాడు నిందితుడు.  పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నారు.

హన్మకొండ టైలర్ స్ట్రీట్ పాలజెండాలో మంగళవారం రాత్రి ఈ ఘటన చోటు చేసుకొంది.  డాబాపై నిద్రిస్తున్న చిన్నారిని కిడ్నాప్ చేసి అత్యాచారం చేసి హత్య చేశాడు ప్రవీణ్ కుమార్ అనే నిందితుడు. 

నిందితుడు ప్రవీణ్ కుమార్ ను పోలీసులు అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నారు. ఇదిలా ఉంటే నిందితుడిని కఠినంగా శిక్షించాలని  మహిళ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.