తెలంగాణలో పదివేలకు చేరువలో కరోనా: కొత్తగా 879 కేసులు.. హైదరాబాద్‌లో తగ్గని తీవ్రత
తెలంగాణలో కరోనా విజృంభణ ఏ మాత్రం తగ్గడం లేదు. మంగళవారం కొత్తగా 879 మందికి పాజిటివ్‌గా తేలినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. వీటితో కలిపి రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 9,533కి చేరింది.
తెలంగాణలో కరోనా విజృంభణ ఏ మాత్రం తగ్గడం లేదు. మంగళవారం కొత్తగా 879 మందికి పాజిటివ్‌గా తేలినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. వీటితో కలిపి రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 9,533కి చేరింది.
ఇవాళ తెలంగాణలో కరోనాతో ముగ్గురు మరణించడంతో మొత్తం మృతుల సంఖ్య 220కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 5,109 మంది వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతుండగా... 4,224 మంది వైరస్ నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు.
Also Read:కరీంనగర్ జిల్లాలో మళ్లీ కరోనా... ఒకే గ్రామంలో నలుగురికి పాజిటివ్
ఇవాళ హైదరాబాద్‌లోని 652 కేసులు నమోదవ్వగా.. మేడ్చల్‌లో 112, రంగారెడ్డిలో 64, కామారెడ్డి 10, వరంగల్ అర్బన్‌లో 9, జనగాంలో 7, వరంగల్ రూరల్, నాగర్‌కర్నూల్ నాలుగేసి కేసులు, మెదక్, మహబూబాబాద్, సంగారెడ్డి, మంచిర్యాలలో రెండేసీ కేసులు నమోదయ్యాయి.
కరీంనగర్ జిల్లాలో మళ్లీ కరోనా కలకలం రేపుతోంది. జిల్లావ్యాప్తంగా ఎక్కడో ఒకచోట రోజూ కరోనా పాజిటివ్ కేసులు బయటపడుతున్నాయి. తాజాగా ఇళ్ళంతకుంట మండలం మాల్యాల గ్రామంలో కరోనా కేసులు బయటపడ్డాయి.
Also Read:కరోనా రోగుల డెడ్‌బాడీల మాయం: దర్యాప్తుకు సీపీ అంజనీకుమార్ ఆదేశం
ఈ చిన్న గ్రామంలో ఏకంగా నలుగురికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది. దీంతో అప్రమత్తమైన అధికారులు ప్రైమరీ కాంటాక్ట్స్ ను గుర్తించే పనిలో పడ్డారు. కరీంనగర్ నగరంలో శనివారం ఒక్కరోజే 13 కేసులు నమోదయ్యాయి. బ్యాంక్ ఉద్యోగులకు, వారితో కాంటాక్ట్ అయిన చిట్ ఫండ్ ఉద్యోగులకూ ఇది కరోనా సోకింది.
ఆరంభంలో కరోనా కేసులు బయటపడ్డ సమయంలో సమర్ధవంతంగా ఎదుర్కొన్న అధికారులు లాక్ డౌన్ సడలింపుల తర్వాత ఆ స్థాయిలో కరోనా కట్టడికి చర్యలు తీసుకోవడం లేదు. అంతేకాకుండా ప్రజలు కూడా ప్రభుత్వ సూచనలను, కరోనా నిబంధనలను పాటించడం లేదు. దీంతో కేసుల సంఖ్య పెరుగుతున్నట్లు వైద్యశాఖ అధికారులు వెల్లడించారు.