Asianet News TeluguAsianet News Telugu

హైదరాబాద్‌ లో ఒకే మహిళ నుంచి 80 మందికి కరోనా..!

తెలంగాణ లో కరోనా పాజిటివ్ కేసులు వరుసగా పెరుగూతూనే ఉన్నాయి.. ఇక, హైదరాబాద్‌ పాత బస్తీలో ఒక మహిళ నుంచి 80 మందికి కరోనా సోకడం కలకలం సృష్టిస్తోంది.. వైద్యుల నిర్లక్ష్యం, కుటుంబ సభ్యులు పూర్తి వివరాలను చెప్పకపోవడం అన్ని వెరసి ఈ వ్యాప్తికి కారణమయింది. 

80 people infected with corona from a single woman in hyderabad
Author
Hyderabad, First Published Apr 19, 2020, 8:42 PM IST

తెలంగాణ లో కరోనా పాజిటివ్ కేసులు వరుసగా పెరుగూతూనే ఉన్నాయి.. ఇక, హైదరాబాద్‌ పాత బస్తీలో ఒక మహిళ నుంచి 80 మందికి కరోనా సోకడం కలకలం సృష్టిస్తోంది.. వైద్యుల నిర్లక్ష్యం, కుటుంబ సభ్యులు పూర్తి వివరాలను చెప్పకపోవడం అన్ని వెరసి ఈ వ్యాప్తికి కారణమయింది. 

వివరాల్లోకి వెళ్తే.. హైదరాబాద్‌ పాత బస్తీ తలాబ్ కట్టా లో ప్రైవేట్‌ హాస్పిటల్స్‌లో డాక్టర్లు, వైద్య సిబ్బంది నిర్లక్ష్యం ఇప్పడు అనేక మంది ప్రాణాల మీదకు తెచ్చింది.

భవానీ నగర్‌ కు చెందిన ఓ వృద్ధురాలు అనారోగ్యం పాలైంది. దీంతో ఆమెను స్దానికంగా గల ఒక డాక్టర్ దగ్గరకు తీసుకెళ్లారు కుటుంబ సభ్యులు. అక్కడి నుంచి అదే ప్రాంతంలో వున్న మరో ప్రైవేట్‌ ఆస్పత్రికి తీసుకెళ్లి చికిత్స అందించారు.

అయితే, వృద్ధురాలికి కరోనా సోకిందేమో ననే సందేహం డాక్టర్లకు గాని, వైద్య సిబ్బంది గాని రాలేదు. దీంతో కనీస జాగ్రత్తలు తీసుకోకుండా చికిత్స చేశారు. అయితే, వృద్ధురాలు చని పోవడంతో సాధారణ మరణం గానే భావించారు. బంధువులంతా కలిసి అంత్యక్రియలు నిర్వహించారు.

కానీ.. శాంపిల్స్‌ సేకరించిన అధికారులు.. రిపోర్టుల్లో కరోనా పాజిటీవ్‌ రావడంతో అప్రమత్తమయ్యారు.

వృద్ధురాలి కుటుంబంలో ఒకరు ఇటీవల ఢిల్లీ మర్కజ్ కు వెళ్లి వచ్చారు. ప్రైమరీ కాంటాక్ట్‌ పద్ధతిలో వృద్ధురాలికి కరోనా వైరస్‌ సోకింది.

అయితే.. ఈ విషయాలేవీ వాకబు చేయ కుండానే వృద్ధురాలికి చికిత్స చేశారు డాక్టర్లు. అయితే, వృద్ధురాలు కరోనా తో చని పోయిందని నిర్ధారణ కావడంతో.. కుటుంబ సభ్యులందరికీ పరీక్షలు నిర్వహించారు అధికారులు.

దీంతో 22 మందికి కరోనా పాజిటీవ్‌ వచ్చింది. మరి కొందరి రిపోర్టులు అందాల్సి ఉంది. వీళ్లందర్నీ ఆస్పత్రులకు తరలించి, వాళ్లతో కలిసి మెలసి తిరిగిన వాళ్లను గుర్తించే పని ప్రారంభించారు అధికారులు.

వృద్ధురాలికి చికిత్స చేసిన ముగ్గురు డాక్టర్లు, నలుగురు నర్సులు కరోనా బారిన పడ్డారు. అలాగే, వృద్ధురాలి బంధువులు, వైద్య సిబ్బందితో కాంటాక్ట్‌ లోకి వచ్చిన వాళ్లను కలుపు కుంటే 80 మందికి పైగా ప్రమాదంలో పడ్డారు.

వృద్ధురాలికి చికిత్స చేసే సమయంలో తగిన జాగ్రత్తలు పాటించి ఉంటే ఈ దుస్థితి ఉండేది కాదంటున్నారు అధికారులు.

ఓ వైపు కరోనా విస్తరిస్తోన్న సమయంలో..  వైద్యులు అప్రమత్తంగా ఉండి ఉంటే.. ఒకరి నుంచి మరొకరికి ఈ వైరస్ అంటుకునేది కాందంటున్నారు వైద్య నిపుణులు.

Follow Us:
Download App:
  • android
  • ios