హైదరాబాద్- శ్రీశైలం జాతీయ రహదారిపై నాగర్ కర్నూల్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. అచ్చంపేట మండలం చెన్నారం గేట్ సమీపంలో రెండు కార్లు ఒకదానికొకటి ఢీకొట్టుకోవడంతో ప్రమాదం జరిగింది. 

హైదరాబాద్- శ్రీశైలం జాతీయ రహదారిపై నాగర్ కర్నూల్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. అచ్చంపేట మండలం చెన్నారం గేట్ సమీపంలో రెండు కార్లు ఒకదానికొకటి ఢీకొట్టుకోవడంతో ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో 8 మంది వరకు మరణించినట్లుగా సమాచారం. ఈ ప్రమాదంలో కార్లు నుజ్జునుజ్జవ్వగా.. మృతదేహాలు చెల్లాచెదురుగా పడ్డాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని గాయపడ్డ ఇద్దరిని ఆసుపత్రికి తరలించారు.