తెలంగాణలో కొత్తగా 749 కరోనా కేసులు నమోదవ్వగా.. ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. గడిచిన 24 గంటల్లో 605 మంది కోవిడ్ నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం తెలంగాణలో 10,203 మంది చికిత్స పొందుతున్నారు.

తెలంగాణలో గడిచిన 24 గంటల్లో 1,15,237 కరోనా పరీక్షలు నిర్వహించగా కొత్తగా 749 మందికి పాజిటివ్‌గా తేలినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. అత్యధికంగా ఖమ్మం జిల్లాలో 96 కొత్త కేసులు నమోదవ్వగా, గ్రేటర్ హైదరాబాద్ లో 72 కేసులు గుర్తించారు. నారాయణపేట జిల్లాలో ఒక్క కేసు కూడా నమోదు కాలేదు. అదే సమయంలో 605 మంది కరోనా నుంచి కోలుకోగా, ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. తాజా మరణాలతో కలిపి తెలంగాణలో మొత్తం 3,743 మంది కరోనాతో కన్నుమూశారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 6,33,895 పాజిటివ్ కేసులు నమోదు కాగా... 6,19,949 మంది కోవిడ్ నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం తెలంగాణలో 10,203 మంది చికిత్స పొందుతున్నారు.

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

ఇక జిల్లాల వారీగా కేసుల విషయానికి వస్తే.. ఆదిలాబాద్ 2, భద్రాద్రి కొత్తగూడెం 36, జీహెచ్ఎంసీ 72, జగిత్యాల 18, జనగామ 5, జయశంకర్ భూపాలపల్లి 15, గద్వాల 4, కామారెడ్డి 2, కరీంనగర్ 58, ఖమ్మం 96, ఆసిఫాబాద్ 1, మహబూబ్‌నగర్ 8, మహబూబాబాద్ 18, మంచిర్యాల 43, మెదక్ 4, మేడ్చల్ మల్కాజిగిరి 28, ములుగు 11, నాగర్ కర్నూల్ 5, నల్గగొండ 54, నారాయణపేట 0, నిర్మల్ 4, నిజామాబాద్ 11, పెద్దపల్లి 41, సిరిసిల్ల 21, రంగారెడ్డి 32, సిద్దిపేట 22, సంగారెడ్డి 12, సూర్యాపేట 34, వికారాబాద్ 5, వనపర్తి 7, వరంగల్ రూరల్ 9, వరంగల్ అర్బన్ 55, యాదాద్రి భువనగిరిలో 16 చొప్పున కేసులు నమోదయ్యాయి. 

Scroll to load tweet…