తెలంగాణలో కొత్తగా 715 మందికి పాజిటివ్.. 6,35,320కి చేరిన మొత్తం కేసులు
తెలంగాణలో కొత్తగా 715 కరోనా కేసులు నమోదవ్వగా.. నలుగురు ప్రాణాలు కోల్పోయారు. 24 గంటల్లో 784 మంది కోలుకోగా.. ప్రస్తుతం తెలంగాణలో 10,028 మంది చికిత్స పొందుతున్నారు.
తెలంగాణలో గడచిన 24 గంటల్లో 1,13,069 కరోనా పరీక్షలు నిర్వహించగా, 715 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. అత్యధికంగా జీహెచ్ఎంసీ పరిధిలో 76 కొత్త కేసులు నమోదయ్యాయి. ఆ తర్వాత ఖమ్మం జిల్లాలో 68, నల్గొండ జిల్లాలో 54 కేసులు వెలుగు చూశాయి. నారాయణపేట జిల్లాలో ఒక్క కొత్త కేసు కూడా నమోదు కాకపోవడం గమనార్హం. అదే సమయంలో 784 మంది కరోనా నుంచి కోలుకోగా, నలుగురు ప్రాణాలు కోల్పోయారు. తాజా మరణాలతో కలిపి తెలంగాణలో మొత్తం 3,751 మంది వైరస్‌తో మృతి చెందారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 6,35,320 పాజిటివ్ కేసులు నమోదు కాగా... 6,21,541 మంది కోలుకున్నారు. ప్రస్తుతం తెలంగాణలో 10,028 మంది చికిత్స పొందుతున్నారు.
ఇక జిల్లాల వారీగా కేసుల విషయానికి వస్తే.. ఆదిలాబాద్ 2, భద్రాద్రి కొత్తగూడెం 39, జీహెచ్ఎంసీ 76, జగిత్యాల 25, జనగామ 9, జయశంకర్ భూపాలపల్లి 13, గద్వాల 6, కామారెడ్డి 4, కరీంనగర్ 52, ఖమ్మం 68, ఆసిఫాబాద్ 4, మహబూబ్‌నగర్ 5, మహబూబాబాద్ 17, మంచిర్యాల 45, మెదక్ 4, మేడ్చల్ మల్కాజిగిరి 27, ములుగు 12, నాగర్ కర్నూల్ 6, నల్గగొండ 54, నారాయణపేట 0, నిర్మల్ 3, నిజామాబాద్ 10, పెద్దపల్లి 41, సిరిసిల్ల 18, రంగారెడ్డి 31, సిద్దిపేట 21, సంగారెడ్డి 7, సూర్యాపేట 29, వికారాబాద్ 2, వనపర్తి 7, వరంగల్ రూరల్ 13, వరంగల్ అర్బన్ 49, యాదాద్రి భువనగిరిలో 16 చొప్పున కేసులు నమోదయ్యాయి.