కరోనా వైరస్‌పై పోరులో ముందు వరుసలో నిలుస్తున్న డాక్టర్లు, పోలీసులు ఈ మహమ్మారి బారినపడుతున్నారు. ఇప్పుడు ఈ లిస్టులో జర్నలిస్టులో కూడా చేరుతున్నారు. వైరస్‌కు సంబంధించిన సమాచారాన్ని  ప్రజలకు అందించే  క్రమంలో పలువురు పాత్రికేయులు కోవిడ్ బారినపడ్డారు.

వీరిలో ఇప్పటికే పలువురు మరణించగా, మరికొందరు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఇక తెలంగాణలో జర్నలిస్టుల పరిస్ధితి ఆందోళనకరంగా మారింది. ఇప్పటి వరకు 70 మంది జర్నలిస్టులకు కోవిడ్ 19 సోకినట్లుగా తెలుస్తోంది.

Also Read:గోకుల్ చాట్ యజమానికి కరోనా: షాపు మూసివేత,20 మంది క్వారంటైన్‌కి తరలింపు

ముఖ్యంగా రాజధాని హైదరాబాద్‌లోని రిపోర్టర్లు, కెమెరామెన్లు, యాంకర్లు కూడా బాధితుల్లో ఉన్నారు. ఛానళ్లలో తక్కువ వేతనాలకు పనిచేసే మేకప్ మెన్లు అదనంగా ఒకటి రెండు ఛానెళ్లలో ఫ్రీలాన్సర్లుగా పనిచేస్తున్నారు. దీంతో వారు వైరస్ క్యారియర్లుగా మారారేమోనన్న భయం వెంటాడుతోంది.

గత నాలుగైదు రోజులుగా హైదరాబాద్‌లోని పాత సచివాయం భవన సముదాయంలో జర్నలిస్టుల కోసం ప్రత్యేకంగా కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నారు. గత శనివారం జర్నలిస్టులు, వారి కుటుంబసభ్యులకు కలిపి 153 మందికి పరీక్షలు నిర్వహించారు.

Also Read:హైద్రాబాద్‌లో కరోనాతో హొంగార్డు ఆశోక్ మృతి

మరోవైపు రాష్ట్రంలో ఇప్పటికే 200 మంది వైద్యులకు, 100 మంది పోలీసులకు, ఇప్పుడు 70 మంది జర్నలిస్టులకు కరోనా సోకడం ప్రభుత్వ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది. కాగా ఇప్పటికే ఓ న్యూస్ ఛానెల్‌లో పనిచేస్తున్న మనోజ్ కుమార్ అనే జర్నలిస్టుకు కరోనాతో ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే.