Asianet News TeluguAsianet News Telugu

తెలంగాణలో మరో కరోనా కేసు: ఆరుగురికి పాజిటివ్ లక్షణాలు

 తెలంగాణలో మరో కరోనా పాజిటివ్ కేసు నమోదైంది. దీంతో తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసులు ఆరుకు చేరుకొన్నాయి.  తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ కరోనా వైరస్ వ్యాధి వ్యాపించకుండా ఉండేందుకు తీసుకోవాల్సిన చర్యలపై ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించనున్నారు. 

6th coronavirus positive case reported in Telangana
Author
Hyderabad, First Published Mar 18, 2020, 1:35 PM IST


హైదరాబాద్: తెలంగాణలో మరో కరోనా పాజిటివ్ కేసు నమోదైంది. దీంతో తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసులు ఆరుకు చేరుకొన్నాయి.  తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ కరోనా వైరస్ వ్యాధి వ్యాపించకుండా ఉండేందుకు తీసుకోవాల్సిన చర్యలపై ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించనున్నారు. 

లండన్ నుండి వచ్చిన ఓ వ్యక్తికి కరోనా లక్షణాలు ఉన్నట్టుగా వైద్యాధికారులు గుర్తించారు. ఇప్పటికే ఇదే రకమైన వ్యాధి లక్షణాలతో ఐదుగురు గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. లండన్ నుండి వచ్చిన వ్యక్తికి కూడ ఈ వ్యాధి లక్షణాలు  పాజిటివ్‌ అని తేలడంతో వైద్యులు అతడిని కూడ ఐసోలేషన్ వార్డుకు తరలించారు. 

Also read:'చికెన్‌తో కరోనా అని నిరూపిస్తే రూ. 5 కోట్ల బహుమతి'

తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్  వైద్య శాఖాధికారులతో బుధవారం నాడు సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు. ఇప్పటికే ఆరుగురికి  కరోనా వ్యాధి లక్షణాలు పాజిటివ్‌గా తేలడంతో  వైద్యశాఖ మరింత అప్రమత్తమైంది. 

గాంధీ ఆసుపత్రిలో  ఆరుగురికి వైద్యులు చికిత్స అందిస్తున్నారు. తెలంగాణలో తొలి కరోనా పాజిటివ్ కేసు నమోదైన వ్యక్తికి పూర్తిగా నయమైంది.  ఇటీవలనే ఆయన ఆసుపత్రి నుండి డిశ్చార్జి అయ్యారు. అయితే  ఆ తర్వాత మరో ఐదు కేసులు నమోదయ్యాయి. ఈ ఐదు కేసులకు తోడు తాజాగా మరో కేసు నమోదైంది. 

Follow Us:
Download App:
  • android
  • ios