తెలంగాణలో కొత్తగా 657 కరోనా కేసులు నమోదవ్వగా.. ఇద్దరు మృతి చెందారు. 578 మంది వైరస్ నుంచి కోలుకోగా.. తెలంగాణలో ప్రస్తుతం 9,314 యాక్టివ్‌ కేసులు వున్నాయి. 

తెలంగాణలో గడిచిన 24 గంటల్లో 1,16,815 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా.. కొత్తగా 657 కేసులు నమోదైనట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. వీటితో కలిపి రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన మొత్తం కేసుల సంఖ్య 6,43,093కు చేరింది. 24 గంటల వ్యవధిలో కరోనా సోకి ఇద్దరు బాధితులు ప్రాణాలు కోల్పోవడంతో ఇప్పటివరకు తెలంగాణలో వైరస్ వల్ల మృతి చెందిన వారి సంఖ్య 3,793కి చేరింది. 24 గంటల వ్యవధిలో 578 మంది వైరస్ నుంచి కోలుకోవడంతో రాష్ట్రంలో ఇప్పటి వరకు డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 6,29,986కి చేరింది. ప్రస్తుతం తెలంగాణలో 9,314 యాక్టివ్‌ కేసులున్నట్లు ఆరోగ్య శాఖ తెలిపింది.

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

ఇక జిల్లాల వారీగా కేసుల విషయానికి వస్తే.. ఆదిలాబాద్ 3, భద్రాద్రి కొత్తగూడెం 16, జీహెచ్ఎంసీ 77, జగిత్యాల 25, జనగామ 13, జయశంకర్ భూపాలపల్లి 4, గద్వాల 3, కామారెడ్డి 4, కరీంనగర్ 64, ఖమ్మం 59, మహబూబ్‌నగర్ 5, ఆసిఫాబాద్ 2, మహబూబాబాద్ 14, మంచిర్యాల 18, మెదక్ 3, మేడ్చల్ మల్కాజిగిరి 32, ములుగు 5, నాగర్ కర్నూల్ 6, నల్గగొండ 42, నారాయణపేట 0, నిర్మల్ 2, నిజామాబాద్ 6, పెద్దపల్లి 42, సిరిసిల్ల 20, రంగారెడ్డి 36, సిద్దిపేట 19, సంగారెడ్డి 10, సూర్యాపేట 23, వికారాబాద్ 3, వనపర్తి 2, వరంగల్ రూరల్ 15, వరంగల్ అర్బన్ 62, యాదాద్రి భువనగిరిలో 22 చొప్పున కేసులు నమోదయ్యాయి.


Scroll to load tweet…