నల్గొండ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. గురువారం సాయంత్రం పెద్ద అడిశర్లపల్లి మండలం అంగడిపేట స్టేజ్ వద్ద ఆటోను లారీ ఢీకొట్టింది.

ఈ ప్రమాదంలో ఆరుగురు దుర్మరణం పాలవ్వగా.. పది మందికి తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.

మృతుల సంఖ్య పెరిగే అవకాశం కనిపిస్తోంది. క్షతగాత్రులను పోలీసులు ఆసుపత్రికి తరలించారు. ఇందుకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది.