Asianet News TeluguAsianet News Telugu

సూర్యాపేటలో కరోనా విలయతాండవం: తెలంగాణలో తాజాగా 56 పాజిటివ్ కేసులు

తెలంగాణలో తాజాగా గత 24 గంటల్లో కొత్తగా 56 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. సూర్యాపేటలో కరోనా వైరస్ విలయతాండవం చేస్తోంది. సూర్యాపేట జిల్లాలో కొత్తగా 26 కేసులు నమోదయ్యాయి.

56 new Corona Positive cases recorded in Telangana
Author
Hyderabad, First Published Apr 21, 2020, 8:05 PM IST

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య నానాటికీ పెరుగుతూనే ఉంది. తాజాగా గత 24 గంటల్లో కొత్తగా 56 కేసులు నమోదయ్యాయి. దీంతో తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 928కి చేరుకుంది. తెలంగాణలో 23 మరణాలు సంభవించాయి. 

కరోనా వైరస్ వ్యాధికి చికిత్స పొంది వివిధ ఆస్పత్రుల నుంచి 194 మంది డిశ్చార్జీ అయ్యారు. దీంతో యాక్టివ్ కేసుల సంఖ్య 711 ఉంది. కరోనా వైరస్ తో సూర్యాపేట జిల్లా అట్టుడుకుతోంది. తాజాగా గత 24 గంటల్లో సూర్యాపేట జిల్లాలో అత్యధికంగా 26 కేసులు నమోదయ్యాయి.  దీంతో సూర్యాపేట జిల్లాలో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య 80కి చేరుకుంది. 

గ్రేటర్ హైదరాబాదు పరిధిలో 19 కేసులు నమోదయ్యాయి. ఈ రోజు కరోా నుంచి కోలుకుని 8 మంది డిశ్చార్జీ అయ్యారు.నిజామాబాద్ జిల్లాలో మూడు కేసులు నమోదు కాగా, గద్వాల, ఆదిలాబాద్ జిల్లాల్లో రెండేసి కేసులు నమోదయ్యాయి. ఖమ్మం, మేడ్చెల్, వరంగల్, రంగారెడ్డి జిల్లాల్లో ఒక్కో కేసు నమోదయ్యాయి. దాంతో మొత్తం కేసుల సంఖ్య తెలంగాణ 928కి చేరుకుంది. 

కాగా, కరోనా వైరస్ వ్యాప్తిపై తెలంగాణ సీఎం కెసీఆర్ సమీక్ష నిర్వహించారు. వికారాబాద్, మేడ్చెల్, సూర్యాపేట జిల్లాలపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆయన అధికారులకు సూచించారు. సూర్యాపేట జిల్లాకు వేణుగోపాల్ రెడ్డిని ప్రత్యేకాధికారిగా నియమించారు.  

దేశంలో కోరనా వైరస్ కేసుల సంఖ్య గంటగంటకూ పెరుగుతున్న సూచనలే కనిపిస్తున్నాయి. కేంద్ర ఆరోగ్య శాఖ మంగళవారం సాయంత్రం బులిటెన్ విడుదల చేసింది. దేశంలో కరోనా వైరస్ కేసుల సంఖ్య 18 వేలు దాటింది. మృతుల సంఖ్య 603కు చేరుకుంది.

Follow Us:
Download App:
  • android
  • ios