ఖమ్మం: తెలంగాణలోని ఉమ్మడి ఖమ్మం జిల్లాలో విచిత్రమైన సంఘటన చేసుకుంది. యాభై ఏళ్ల వయస్సులో రాములమ్మ అనే మహిళ బిడ్డకు జన్మ ఇచ్చింది. పిల్లలు పుట్టకుండా పాతికేళ్ల క్రితం ఆమె ఆపరేషన్ చేయించుకుంది. అయినప్పటికీ ఆమెకు ఇప్పుడు బిడ్డ పుట్టింది.

రాములమ్మకు ఇప్పటికే ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. రాములమ్మకు పురుటి నొప్పులు రావడంతో 108కు ఫోన్ చేశారు. అంబులెన్స్ వచ్చి ఆమెను భద్రాచలం ఏరియా ఆస్పత్రికి తీసుకుని వెళ్లింది. అక్కడ ఆమె పురుడు పోసుకుంది. మందులు సరిగా వాడకపోవడంతో బిడ్డ బరువు తక్కువగా ఉంది.