తెలంగాణలో కరోనా ఉద్ధృతి కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో 71,221 నమూనాలను పరీక్షించగా.. 4,693 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్లు వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. దీంతో రాష్ట్రంలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కేసుల సంఖ్య 5,16,404కి చేరింది.

తాజాగా కోవిడ్ వల్ల 33 మంది ప్రాణాలు కోల్పోగా నేటి వరకు మొత్తం మృతుల సంఖ్య 2,863కి పెరిగింది. ఈరోజు 6,876 మంది వైరస్‌ నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం తెలంగాణలోని వివిధ ఆసుపత్రుల్లో 56,917 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి.

Also Read:పేషెంట్లకు అన్యాయం చేయొద్దు: #ASK KTR‌లో ఆసుపత్రులకు మంత్రి విజ్ఞప్తి

ఇవాళ ఒక్క జీహెచ్‌ఎంసీ పరిధిలోనే 734 కేసులు నమోదయ్యాయి.  కాగా, దేశంలో కరోనా మరణాల రేటు 1.1 శాతం ఉండగా, తెలంగాణలో 0.55 శాతంగా నమోదైంది. అటు, రికవరీ రేటు చూస్తే దేశంలో 83.2 శాతం నమోదు కాగా, తెలంగాణలో 88.42 శాతంగా ఉంది. 

జిల్లాల వారీగా చూస్తే ఆదిలాబాద్‌ 39, భద్రాద్రి కొత్తగూడెం 118, జీహెచ్ఎంసీ 734, జగిత్యాల 140, జనగామ 45, జైశంకర్ భూపాల్‌పల్లి 63, జోగులాంబ గద్వాల 66, కామారెడ్డి 52, కరీంనగర్ 209, ఖమ్మం 198, కోమరంభీం ఆసిఫాబాద్ 50, మహబూబ్‌నగర్ 122, మహబూబాబాద్ 113, మంచిర్యాల 130, మెదక్ 57, మేడ్చల్ మల్కాజ్‌గిరి 285, ములుగు 58, నాగర్ కర్నూల్ 156, నల్గొండ 296, నారాయణ్‌పేట్  39, నిర్మల్ 37, నిజామాబాద్ 98, పెద్దపల్లి 126, రాజన్న సిరిసిల్ల 91, రంగారెడ్డి 296, సంగారెడ్డి 136, సిద్దిపేట 150, సూర్యాపేట 45, వికారాబాద్ 179, వనపర్తి 95, వరంగల్ రూరల్ 189, వరంగల్ అర్బన్ 161, యాదాద్రి భువనగిరిలలో 120 చొప్పున కేసులు నమోదయ్యాయి.