తెలంగాణలో అదుపులోకి కోవిడ్.. 5 వందల దిగువకి కొత్త కేసులు

తెలంగాణలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 429 పాజిటివ్‌ కేసులు నమోదైనట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. మహమ్మారి బారి నుంచి నిన్న 2,421 మంది కోలుకున్నారు. ప్రస్తుతం తెలంగాణలో 11,681 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి.  
 

429 new corona cases reported in telangana

తెలంగాణలో కరోనా కేసులు (corona cases in telangana) తగ్గుముఖం పట్టాయి. గడిచిన 24 గంటల్లో 32,932 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. కొత్తగా 429 పాజిటివ్‌ కేసులు నమోదైనట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. వీటితో కలిపి ఇప్పటి వరకు తెలంగాణలో కరోనా బారినపడిన వారి సంఖ్య 7,83,448కి చేరింది. గత 24 గంటల వ్యవధిలో రాష్ట్రంలో కోవిడ్‌తో ఒకరు ప్రాణాలు కోల్పోయారు. వీరితో కలిపి ఇప్పటివరకు (covid deaths in telangana) రాష్ట్రంలో ప్రాణాలు కోల్పోయినవారి సంఖ్య 4,107కి చేరింది. మహమ్మారి బారి నుంచి నిన్న 2,421 మంది కోలుకున్నారు. ప్రస్తుతం తెలంగాణలో 11,681 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి.  

ఇక జిల్లాల వారీగా కేసుల విషయానికి వస్తే.. ఆదిలాబాద్ 7, భద్రాద్రి కొత్తగూడెం 5, జీహెచ్ఎంసీ 142, జగిత్యాల 6, జనగామ 9, జయశంకర్ భూపాలపల్లి 1, గద్వాల 0, కామారెడ్డి 3, కరీంనగర్ 18, ఖమ్మం 10, మహబూబ్‌నగర్ 15, ఆసిఫాబాద్ 5, మహబూబాబాద్ 9, మంచిర్యాల 9, మెదక్ 3, మేడ్చల్ మల్కాజిగిరి 41, ములుగు 3, నాగర్ కర్నూల్ 3, నల్గగొండ 22, నారాయణపేట 5, నిర్మల్ 2, నిజామాబాద్ 8, పెద్దపల్లి 5, సిరిసిల్ల 3, రంగారెడ్డి 33, సిద్దిపేట 10, సంగారెడ్డి 13, సూర్యాపేట 5, వికారాబాద్ 5, వనపర్తి 3, వరంగల్ రూరల్ 6, హనుమకొండ 19, యాదాద్రి భువనగిరిలో 1 చొప్పున కేసులు నమోదయ్యాయి

కాగా.. దేశంలో క‌రోనా కొత్త కేసుల్లో స్వ‌ల్ప త‌గ్గుద‌ల న‌మోదైంది. కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ వెల్ల‌డించిన వివ‌రాల ప్ర‌కారం.. గ‌త 24 గంట‌ల్లో దేశంలో కొత్త న‌మోదైన క‌రోనా వైర‌స్ కేసులు త‌గ్గ‌గ‌, మ‌ర‌ణాలు స్వ‌ల్పంగా పెరిగాయి.  కొత్తగా 44877 కోవిడ్‌-19 కేసులు వెలుగుచూశాయి. దీంతో  దేశంలో క‌రోనా బారిన‌ప‌డ్డ వారి సంఖ్య మొత్తం 4,26,31,421కు పెరిగింది. ఇదే స‌మ‌యంలో 1,17,591 (RECOVERED) మంది క‌రోనా నుంచి కోలుకున్నారు. మొత్తం కోవిడ్-19 రిక‌వ‌రీల సంఖ్య 4,15,85,711 కి పెరిగింది. ప్ర‌స్తుతం 5,37,045 యాక్టివ్ కేసులు ఉన్నాయి. 

గ‌త 24 గంటల్లో క‌రోనా మ‌హ‌మ్మారితో పోరాడుతూ 684 మంది ప్రాణాలు కోల్పోయారు. అంత‌కు ముందు రోజుతో పోలిస్తే.. స్వ‌ల్పంగా త‌గ్గాయి. ఇప్ప‌టివ‌ర‌కు దేశంలో మొత్తం 5,08,665మంది కరోనా వైర‌స్ కార‌ణంగా ప్రాణాలు కోల్పోయారు. ప్ర‌స్తుతం క‌రోనా రిక‌వ‌రీ రేటు 97.4 శాతంగా ఉండ‌గా, మ‌ర‌ణాల రేటు 1.19 శాతంగా ఉంది. క‌రోనా రోజువారీ పాజిటివిటీ రేటు 3.17 శాతంగా ఉంది. దేశంలో క‌రోనా కేసులు, మ‌ర‌ణాలు అధికంగా న‌మోదైన రాష్ట్రాల జాబితాలో మ‌హారాష్ట్ర, కేర‌ళ‌, క‌ర్నాట‌క‌, త‌మిళ‌నాడు, ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌, వెస్ట్ బెంగాల్‌, ఢిల్లీ, ఒడిశా, రాజ‌స్థాన్‌, గుజ‌రాత్ లు టాప్ లో ఉన్నాయి. మ‌హారాష్ట్రలో అత్య‌ధికంగా ఇప్ప‌టివ‌ర‌కు మొత్తం 78,39,447 మంది క‌రోనా బారిన‌ప‌డ్డారు. అలాగే, 1,43,387 మంది వైర‌స్ తో పోరాడుతూ ప్రాణాలు కోల్పోయారు. అయితే, గ‌త 24 గంట‌ల్లో కొత్త‌గా క‌రోనా కేసులు, మ‌ర‌ణాలు అధికంగా కేర‌ళ‌లో న‌మోద‌య్యాయి. కొత్త‌గా కేర‌ళ‌లో 15,184 కేసులు, 427 మ‌ర‌ణాలు చోటుచేసుకున్నాయి. 

 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios