Asianet News TeluguAsianet News Telugu

నిర్మల్‌: గడ్డన్న వాగు గేట్లు ఎత్తివేత.. వరదలో చిక్కుకున్న 40 మంది

నిర్మల్ జిల్లా భైంసాలోని గడ్డెన వాగు పూర్తిగా నిండిపోయింది. దీంతో ఐదు గేట్లు ఎత్తి దిగువకు నీటిని వదిలారు. ఇదే సమయంలో ఆటోనగర్‌ను వరదనీరు ముంచెత్తింది

40 members stuck in floods in nirmal ksp
Author
Nirmal, First Published Jul 22, 2021, 3:46 PM IST

తెలుగు రాష్ట్రాలను వర్షాలు ముంచెత్తుతున్నాయి. చాలా జిల్లాల్లో వాగులు, వంకలు పోటెత్తాయి. నిర్మల్ జిల్లా భైంసాలోని గడ్డెన వాగు పూర్తిగా నిండిపోయింది. దీంతో ఐదు గేట్లు ఎత్తి దిగువకు నీటిని వదిలారు. ఇదే సమయంలో ఆటోనగర్‌ను వరదనీరు ముంచెత్తింది. వరదలో 40 మందికిపైగా చిక్కుకుపోయారు. సమాచారం అందుకున్న అధికారులు నాటు పడవల సాయంతో వారిని బయటకు తీసుకొస్తున్నారు. విషయం తెలుసుకున్న మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ఆటోనగర్‌కు చేరుకుని సహాయక చర్యలను పరిశీలించారు. 

అటు నిర్మల్ జిల్లా సిద్ధాపూర్ వద్ద జీఎస్ఆర్ కాలనీలోనూ వరద ఉద్ధృతి నెలకొంది. వరద నీరు వుండటంతో ఇళ్లపైనే కాలనీ వాసులు గడుపుతున్నారు. సహాయక చర్యల కోసం కాలనీవాసులు ఎదురుచూస్తున్నారు. ప్రత్యేక బృందాన్ని తీసుకొచ్చే ప్రయత్నంలో అధికారులు వున్నట్లుగా తెలుస్తోంది. సిద్ధాపూర్ ఫిల్టర్ బెడ్‌ను స్వర్ణా నది వరద నీరు చుట్టుముట్టింది. 

Follow Us:
Download App:
  • android
  • ios