సూర్యాపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. చిలుకూరు మండలం మిట్స్ కళాశాల వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో నలుగురు దుర్మరణం పాలయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.

మరణించిన వారిని పోస్ట్‌మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. మృతులను మహబూబాబాద్ జిల్లా చింతపల్లి మండలానికి చెందిన వారిగా గుర్తించారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.