తెలంగాణలో కొత్తగా 339 కరోనా కేసులు నమోదవ్వగా.. ఇద్దరు మృతి చెందారు. 417 మంది వైరస్ నుంచి కోలుకోగా.. తెలంగాణలో ప్రస్తుతం 6,166 యాక్టివ్‌ కేసులు వున్నాయి.

తెలంగాణలో గడచిన 24 గంటల్లో 80,568 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా.. కొత్తగా 339 పాజిటివ్ కేసులు నమోదైనట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో అత్యధికంగా 91 కొత్త కేసులు నమోదవ్వగా... కరీంనగర్ జిల్లాలో 31, ఖమ్మం జిల్లాలో 28 కేసులు గుర్తించారు. కొమరంభీం ఆసిఫాబాద్, మెదక్, నారాయణపేట జిల్లాల్లో ఒక్క కొత్త కేసు కూడా నమోదు కాలేదు. అదే సమయంలో 417 మంది కోవిడ్ నుంచి కోలుకోగా, ఇద్దరు మరణించారు. తాజాగా కేసులతో కలిపి తెలంగాణలో ఇప్పటివరకు 6,56,794 పాజిటివ్ కేసులు నమోదు కాగా... 6,46,761 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఇంకా 6,166 మంది చికిత్స పొందుతున్నారు. నిన్న చోటు చేసుకున్న మరణాలతో కలిపి కరోనా మృతుల సంఖ్య 3,867కి చేరింది.

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

ఇక జిల్లాల వారీగా కేసుల విషయానికి వస్తే.. ఆదిలాబాద్ 3, భద్రాద్రి కొత్తగూడెం 5, జీహెచ్ఎంసీ 91, జగిత్యాల 14, జనగామ 4, జయశంకర్ భూపాలపల్లి 1, గద్వాల 2, కామారెడ్డి 2, కరీంనగర్ 31, ఖమ్మం 28, మహబూబ్‌నగర్ 3, ఆసిఫాబాద్ 0, మహబూబాబాద్ 4, మంచిర్యాల 9, మెదక్ 0, మేడ్చల్ మల్కాజిగిరి 21, ములుగు 5, నాగర్ కర్నూల్ 1, నల్గగొండ 15, నారాయణపేట 0, నిర్మల్ 1, నిజామాబాద్ 4, పెద్దపల్లి 16, సిరిసిల్ల 5, రంగారెడ్డి 19, సిద్దిపేట 10, సంగారెడ్డి 3, సూర్యాపేట 9, వికారాబాద్ 1 వనపర్తి 3, వరంగల్ రూరల్ 6, వరంగల్ అర్బన్ 18, యాదాద్రి భువనగిరిలో 5 చొప్పున కేసులు నమోదయ్యాయి.


Scroll to load tweet…