తెలంగాణలో కొత్తగా 338 కరోనా కేసులు నమోదవ్వగా.. ఒకరు మృతి చెందారు. 364 మంది వైరస్ నుంచి కోలుకోగా.. తెలంగాణలో ప్రస్తుతం 5,864 యాక్టివ్‌ కేసులు వున్నాయి. 

తెలంగాణలో గడచిన 24 గంటల్లో 74,207 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా, 338 మందికి పాజిటివ్ గా వెల్లడైనట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. అత్యధికంగా జీహెచ్ఎంసీ పరిధిలోనే 84 కొత్త కేసులు నమోదయ్యాయి. కరీంనగర్ జిల్లాలో 30, వరంగల్ అర్బన్ జిల్లాలో 27 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. వికారాబాద్, నారాయణపేట, కామారెడ్డి జిల్లాల్లో ఒక్క కొత్త కేసు కూడా నమోదు కాలేదు.

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

అదే సమయంలో కోవిడ్ నుంచి 364 మంది కోలుకోగా, ఒకరు ప్రాణాలు కోల్పోయారు. తాజాగా కేసులతో కలిపి తెలంగాణ ఇప్పటివరకు వైరస్ బారినపడిన వారి సంఖ్య 6,58,054కి చేరింది. నిన్న కోలుకున్న వారితో కలిపి ఇప్పటి వరకు మొత్తం డిశ్చార్జ్‌ల సంఖ్య 6,48,317కి చేరింది. ప్రస్తుతం తెలంగాణలో 5,864 మంది చికిత్స పొందుతున్నారు. తాజా మరణంతో కలిపి రాష్ట్రంలో మొత్తం కరోనా మృతుల సంఖ్య 3,873కి పెరిగింది.

ఇక జిల్లాల వారీగా కేసుల విషయానికి వస్తే.. ఆదిలాబాద్ 3, భద్రాద్రి కొత్తగూడెం 10, జీహెచ్ఎంసీ 84, జగిత్యాల 16, జనగామ 6, జయశంకర్ భూపాలపల్లి 3, గద్వాల 1, కామారెడ్డి 0, కరీంనగర్ 30, ఖమ్మం 19, మహబూబ్‌నగర్ 4, ఆసిఫాబాద్ 1, మహబూబాబాద్ 6, మంచిర్యాల 7, మెదక్ 1, మేడ్చల్ మల్కాజిగిరి 17, ములుగు 3, నాగర్ కర్నూల్ 1, నల్గగొండ 21, నారాయణపేట 0, నిర్మల్ 3, నిజామాబాద్ 2, పెద్దపల్లి 16, సిరిసిల్ల 6, రంగారెడ్డి 21, సిద్దిపేట 5, సంగారెడ్డి 3, సూర్యాపేట 7, వికారాబాద్ 0, వనపర్తి 3, వరంగల్ రూరల్ 5, వరంగల్ అర్బన్ 27, యాదాద్రి భువనగిరిలో 7 చొప్పున కేసులు నమోదయ్యాయి

Scroll to load tweet…