హైదరాబాద్: ఎర్రగడ్డ మెంటల్ ఆసుపత్రిలో కరోనా కలకలం సృష్టించింది.ఈ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న 31 మంది మానసిక రోగులకు కరోనా సోకింది. ఇక్కడ పనిచేసే సిబ్బంది నుండి రోగులకు కరోనా సోకిందని రోగుల బంధువులు అనుమానిస్తున్నారు.

కరోనా సోకిన రోగులకు ప్రత్యేక వార్డులో చికిత్స అందిస్తున్నారు. ఈ ఆసుపత్రి సిబ్బందికి కూడా కరోనా సోకినట్టుగా తెలుస్తోంది.  తెలంగాణ రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య పెరిగిపోతున్నాయి. జీహెచ్ఎంసీ పరిధిలో కరోనా కేసులు కొంచెం తగ్గుముఖం పట్టాయి.

రాష్ట్రంలో కరోనా కేసులు 92 వేలు దాటాయి. జీహెచ్ఎంసీ పరిధిలో కరోనా కేసులు భారీగా తగ్గాయి.సెప్టెంబర్ చివరి నాటికి రాష్ట్రంలో కరోనా కేసులు మరింత తగ్గే అవకాశం ఉందని తెలంగాణ రాష్ట్ర వైద్యాధికారులు అభిప్రాయంతో ఉన్నారు.

తెలంగాణలో కరోనాతో మరణించిన వారి సంఖ్య 703కి చేరుకొంది. రాష్ట్రంలో ఇప్పటివరకు కరోనా సోకి 70,132 నుండి కోలుకొన్నారు.నిర్మల్, నారాయణపేట, భూపాలపల్లి జిల్లాల్లో గత 24 గంటల్లో ఒక్క కేసు కూడ నమోదు కాలేదు.