Asianet News TeluguAsianet News Telugu

హత్య కేసు.. ముగ్గురు నిందితులకు జీవిత ఖైదు, జగిత్యాల కోర్టు సంచలన తీర్పు

ఓ హత్య కేసులో అడ్వకేట్‌తో సహా మరో ముగ్గురికి జీవిత ఖైదు విధిస్తూ జగిత్యాల జిల్లా కోర్టు శుక్రవారం సంచలన తీర్పు వెలువరించింది. దీనితో పాటు రూ. 20 వేల చొప్పున జరిమానా కూడా కట్టాలని తీర్పునిచ్చింది.
 

3 sentenced to life by jagityal court in murder case
Author
Jagtial, First Published Aug 27, 2021, 6:36 PM IST

జగిత్యాల జిల్లా కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. ఓ హత్య కేసులో అడ్వకేట్‌తో సహా మరో ముగ్గురికి జీవిత ఖైదు విధించింది. దీనితో పాటు రూ. 20 వేల చొప్పున జరిమానా కూడా కట్టాలని తీర్పునిచ్చింది. 2012న పెగడపల్లి మండలం సుద్దపల్లికి చెందిన మోహన్ రెడ్డి అనే వ్యక్తిని పాత కక్ష్యల నెపంతో హత్య చేసిన ఘటనలో 120-బి, 302, 109 రెడ్ విత్ 34 ఐపీసీ సెక్షన్ల కింద కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

హత్య జరిగిన తరువాత 10 మందిపై కేసు నమోదు చేసిన పోలీసులు వారిని నిందితులుగా చేర్చారు. ఆ తరువాత ఐదుగురికి ఈ కేసుతో సంబంధం లేదని గుర్తించిన పోలీసులు వారిని కేసు నుండి తొలగించారు. సుదీర్ఘ విచారణ అనంతరం నిందితుల్లో అడ్వకేట్ రాచకొండ గంగారెడ్డి, బిడిగె నర్సయ్య అలియాస్ జీపు నర్సయ్య, పన్నాల మహేష్, నర్సింహరెడ్డి అలియాస్ నర్సయ్యలకు జీవిత ఖైదు విధిస్తూ జగిత్యాల జిల్లా రెండో అడిషనల్ జడ్జి జి.సుదర్శన్ తీర్పును వెలువరించారు. అలాగే నిందితులకు రూ. 20 వేల చొప్పున జరిమానా కూడా విధించారు.

ఈ కేసులో ఏ3గా ఉన్న రాచకొండ అంజిరెడ్డి విచారణ సమయంలోనే మరణించాడని పోలీసులు తెలిపారు. ఈ కేసులో హత్యకు గురైన మోహన్ రెడ్డి.. రాచకొండ గంగారెడ్డి తండ్రిని గతంలో హత్య చేశాడు. అయితే, ఈ కేసులో మోహన్ రెడ్డికి కోర్టు శిక్ష కూడా విధించింది. జైలు నుంచి బయటకు వచ్చిన మోహన్ రెడ్డిని ప్రతీకారం తీర్చుకునేందుకు హత్య చేశాడు. 

Follow Us:
Download App:
  • android
  • ios