రంగారెడ్డి జిల్లా దుండిగల్ శంభిపూర్‌లో మూడు నెలల చిన్నారి మృతి చెందడం కలకలం రేపుతోంది. ఆదివారం పోలియో చుక్కలు వేయించిన తర్వాత పాప అస్వస్థతకు గురైందని తల్లిదండ్రులు చెబుతున్నారు.

ఈ రోజు మధ్యాహ్నం పోలియో చుక్కలు వేయించారు. ఆ వెంటనే పాప అస్వస్థతకు గురికావడంతో చిన్నారిని మియాపూర్ ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే చిన్నారి మరణించింది.

పోలియో చుక్కలు వేయించిన తర్వాతే పాప చనిపోయిందని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. దీంతో రంగంలోకి దిగిన వైద్యాధికారులు చిన్నారి మరణానికి దారి తీసిన పరిస్ధితులపై ఆరా తీస్తున్నారు.