శ్రీశైలం-హైదరాబాద్‌ హైవే రహదారిపై ఆదివారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు  అక్కడికక్కడే మృతిచెందారు. 

పూర్తి వివరాల్లోకి వెళితే..నాగర్‌కర్నూల్‌ జిల్లా ఉప్పునుంతల మండలం వెల్టూరు సమీపంలోగల శ్రీశైలం-హైదరాబాద్ జాతీయ రహదారిపై ఆదివారం కారు ద్విచక్ర వాహనాన్ని ఢీకొంది.  ఈ ఘటనలో ద్విచక్ర వాహనంపై ఉన్న  ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతిచెందారు. 

కారులోని వ్యక్తి అక్కడి నుంచి పరారైనట్లు సమాచారం. విషయం తెలుసుకున్న  పోలీసులు హూటాహుటిన ప్రమాద స్థలికి చేరుకున్నారు. మృతుల వివరాలు తెలియాల్సి ఉంది. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.