తెలంగాణలో కొత్తగా 230 కరోనా కేసులు నమోదవ్వగా.. ఒకరు మృతి చెందారు. 357 మంది వైరస్ నుంచి కోలుకోగా.. తెలంగాణలో ప్రస్తుతం 5,545 యాక్టివ్‌ కేసులు వున్నాయి 

తెలంగాణలో మరోసారి కరోనా కేసులు భారీగా పడిపోయాయి. గడిచిన 24 గంటల్లో 50,636 మందికి కోవిడ్ పరీక్షలు నిర్వహించగా, 230 పాజిటివ్ కేసులు నమోదైనట్లు వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. అత్యధికంగా జీహెచ్ఎంసీ పరిధిలో 72 కొత్త కేసులు వెల్లడయ్యాయి. ఆదిలాబాద్, కొమరంభీం ఆసిఫాబాద్, నాగర్ కర్నూల్, నారాయణపేట, నిర్మల్ జిల్లాల్లో ఒక్క కొత్త కేసు కూడా నమోదు కాలేదు. అదే సమయంలో 357 మంది కరోనా నుంచి కోలుకోగా, ఒకరు మరణించారు. తాజా కేసులతో కలిపి రాష్ట్రంలో ఇప్పటివరకు కోవిడ్ బారిన పడిన వారి సంఖ్య 6,59,543కి చేరుకుంది. ఇప్పటి వరకు వైరస్ బారి నుంచి 6,50,114 మంది కోలుకున్నారు. ప్రస్తుతం తెలంగాణలో 5,545 యాక్టీవ్ కేసులున్నాయి. తాజా మరణాలతో కలిపి రాష్ట్రంలో కరోనా వల్ల మరణించిన వారి సంఖ్య 3,884కి పెరిగింది.

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

ఇక జిల్లాల వారీగా కేసుల విషయానికి వస్తే.. ఆదిలాబాద్ 0, భద్రాద్రి కొత్తగూడెం 6, జీహెచ్ఎంసీ 72, జగిత్యాల 6, జనగామ 5, జయశంకర్ భూపాలపల్లి 1, గద్వాల 2, కామారెడ్డి 1, కరీంనగర్ 11, ఖమ్మం 6, మహబూబ్‌నగర్ 3, ఆసిఫాబాద్ 0, మహబూబాబాద్ 2, మంచిర్యాల 3, మెదక్ 3, మేడ్చల్ మల్కాజిగిరి 17, ములుగు 2, నాగర్ కర్నూల్ 0, నల్గగొండ 11, నారాయణపేట 0, నిర్మల్ 0, నిజామాబాద్ 3, పెద్దపల్లి 8, సిరిసిల్ల 6, రంగారెడ్డి 15, సిద్దిపేట 7, సంగారెడ్డి 3, సూర్యాపేట 7, వికారాబాద్ 3, వనపర్తి 2, వరంగల్ రూరల్ 5, వరంగల్ అర్బన్ 18, యాదాద్రి భువనగిరిలో 2 చొప్పున కేసులు నమోదయ్యాయి.

Scroll to load tweet…