తెలంగాణలో క్రమంగా కరోనా కేసులు తగ్గుతున్నాయి. ఇవాళ కొత్తగా 2261 కేసులు నమోదయినట్టు వైద్య ఆరోగ్యశాఖ డైరక్టర్ శ్రీనివాసరావు వెల్లడించారు. వైరస్ బారినపడి నేడు 18 మంది చనిపోయారని తెలిపారు. మరోవైపు 3,043 మంది బాధితులు కోవిడ్ నుండి కోలుకున్నారని డీహెచ్ వివరించారు. పాజిటివిటి రేటు 2 శాతానికి పడిపోయిందని వెల్లడించారు. రెండో విడతలో 87,49,549 ఇళ్లలో సర్వే పూర్తి చేశామని.. ఈ సమయంలో 4,037 మందికి కోవిడ్ లక్షణాలు ఉన్నట్లు గుర్తించామని శ్రీనివాసరావు పేర్కొన్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 1100 బ్లాక్ ఫంగస్ కేసులు నమోదైనట్లు ఆయన వెల్లడించారు. 

ఇక జిల్లాల వారీగా కేసుల విషయానికి వస్తే.. ఆదిలాబాద్ 10, భద్రాద్రి కొత్తగూడెం 108, జీహెచ్ఎంసీ 279, జగిత్యాల 55, జనగామ  25, జయశంకర్ భూపాలపల్లి 35, గద్వాల 29, కామారెడ్డి 11, కరీంనగర్ 101, ఖమ్మం 142, మహబూబ్‌నగర్ 83, ఆసిఫాబాద్ 17, మహబూబాబాద్ 75, మంచిర్యాల 81, మెదక్ 22, మేడ్చల్ మల్కాజిగిరి 127, ములుగు 31, నాగర్ కర్నూల్ 42, నల్గగొండ 160, నారాయణపేట 14, నిర్మల్ 8, నిజామాబాద్ 28, పెద్దపల్లి 96, సిరిసిల్ల 37, రంగారెడ్డి 142, సిద్దిపేట 91, సంగారెడ్డి 53, సూర్యాపేట 84, వికారాబాద్ 52, వనపర్తి 51, వరంగల్ రూరల్ 48, వరంగల్ అర్బన్ 84, యాదాద్రి భువనగిరిలో 40 చొప్పున కేసులు నమోదయ్యాయి.