హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో లాక్‌డౌన్  అమల్లోకి వచ్చింది. ప్రతి రోజూ 20 గంటలపాటు లాక్‌డౌన్ అమల్లో ఉంటుంది. కేవలం నాలుగు గంటల పాటు  నిత్యావసర సరుకుల  కొనుగోలు కోసం  మినహాయింపు ఇచ్చింది ప్రభుత్వం.రాష్ట్రంలో ఈ నెల 12 నుండి పది రోజుల పాటు లాక్‌డౌన్ అమల్లో ఉంటుంది. ఈ నెల 20వ తేదీన కేబినెట్ సమావేశం ఏర్పాటు చేసి లాక్‌డౌన్ పై రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకొంటుంది. రాష్ట్ర ప్రభుత్వం మినహాయింపు ఇచ్చిన వర్గాలు,రంగాలు, సంస్థలకు మాత్రమే లాక్‌డౌన్  నుండి వెసులుబాటు కల్పించనున్నారు.  

also read:తెలంగాణలో లాక్‌డౌన్: స్వంత ఊళ్లకు జనం పయనం, నిత్యావసరాల కోసం రోడ్లపైకి ప్రజలు

టీకాలు వేసుకొనేందుకు వెళ్లేవారికి లాక్‌డౌన్ నుండి మినహాయింపు ఇవ్వాలని ప్రభుత్వం ఆదేశించింది.లాక్‌డౌన్ పై మార్గదర్శకాలను రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం నాడు రాత్రి విడుదల చేసింది. లాక్‌డౌన్ నిబంధనలను ఉల్లంఘించినవారిపై చర్యలు తీసుకొంటామని రాష్ట్ర ప్రభుత్వం హెచ్చరించింది. తెలంగాణ రాష్ట్ర సరిహద్దుల్లో చెక్‌పోస్టులు ఏర్పాటు చేశారు. లాక్‌డౌన్ నేపథ్యంలో  ఇతర రాష్ట్రాల నుండి రాకపోకలపై నియంత్రణ కొనసాగించేందుకు చెక్‌పోస్టులు ఏర్పాటు చేశారు. అత్యవసర సేవలు, సరుకుల రవాణాకు మినహాయింపు ఇచ్చారు. లాక్‌డౌన్ నేపథ్యంలో  పెద్ద ఎత్తున ప్రజలు తమ స్వంత ఊళ్లకు పయనమయ్యారు.