హైదరాబాద్ దుండిగల్‌లో దారుణం జరిగింది.. కన్నబిడ్డ వయసున్న ఓ రెండేళ్ల చిన్నారిపై మొయినుద్దీన్ అనే ఆటోడ్రైవర్ అత్యాచారం చేశాడు. గురువారం రాత్రి ఇంటి వద్ద ఆడుకుంటున్న బాలికను అపహరించిన మొయినుద్దీన్ ఆమెను నిర్మానుష్యంగా ఉన్న ప్రాంతానికి తీసుకెళ్లి లైంగికదాడికి పాల్పడ్డాడు.

పాప అరుపులు, కేకలు పెట్టడంతో వెంటనే గమనించిన స్థానికులు అక్కడికి పరుగులు తీశారు. నిందితుడు మొయినుద్దీన్‌ను పట్టుకుని చితకబాదారు. అనంతరం పోలీసులకు అప్పగించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు చిన్నారిని వైద్య పరీక్షల నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.