హైదరాబాద్ నెహ్రూ జూలో విషాదం చోటు చేసుకుంది.  జూకు చెందిన వాహనం ఢీకొట్టడంతో బాలుడు మరణించాడు. వివరాల్లోకి వెళితే... నిన్న క్రిస్మస్ సెలవుదినం కావడంతో ఓ కుటుంబం నెహ్రూ జూలాజికల్ పార్క్ సందర్శనకు వచ్చింది. ఈ సమయంలో కుటుంబంలోని చిన్నారి జంతువులను చూస్తుండగా.. జూ కు చెందిన వాహనం అతనిని ఢీకొట్టింది.

వెంటనే స్పందించిన సందర్శకులు చిన్నారిని హుటాహుటిన దూరేషవర్ ఆసుపత్రికి తరలిస్తుండగా.. మార్గమధ్యంలోనే ప్రాణాలు కోల్పోయాడు. దీనిపై బాలుడి తల్లిదండ్రులు, పర్యాటకులు అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగానే చిన్నారి మరణించాడని మండిపడ్డారు.