నారాయణపేట జిల్లాలో రథసప్తమి వేడుకల్లో విషాదం చోటు చేసుకుంది. వెంకట రమణస్వామి ఆలయ రథానికి విద్యుత్ షాక్ తగిలింది. ఈ ఘటనలో ఇద్దరు మరణించగా, పలువురికి తీవ్రగాయాలయ్యాయి. దామరగిద్ద మండలం బాపన్‌పల్లిలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఇందుకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది.