తెలంగాణలో కరోనా వైరస్ దాదాపుగా అదుపులోకి వచ్చినట్లు కనిపిస్తోంది. గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో 1,20,525 మందికి కరోనా నిర్థారణ పరీక్షలు నిర్వహించగా... కొత్తగా 1,771 మందికి పాజిటివ్‌గా తేలింది. 

తెలంగాణలో కరోనా వైరస్ దాదాపుగా అదుపులోకి వచ్చినట్లు కనిపిస్తోంది. గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో 1,20,525 మందికి కరోనా నిర్థారణ పరీక్షలు నిర్వహించగా... కొత్తగా 1,771 మందికి పాజిటివ్‌గా తేలింది. ఈమేరకు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ బులిటెన్‌ విడుదల చేసింది. కోవిడ్ వల్ల నిన్న 13 మంది మరణించారు. దీంతో కరోనాతో ఇప్పటి వరకు మరణించిన వారి సంఖ్య 3,469కి చేరింది. మహమ్మారి బారి నుంచి నిన్న 2,384 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 22,133 యాక్టివ్‌ కేసులు ఉన్నాయని ప్రభుత్వం తెలిపింది. ఎప్పటిలాగే జీహెచ్‌ఎంసీలో అత్యధికంగా 171 కేసులు నమోదయ్యాయి.

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

ఇక జిల్లాల వారీగా కేసుల విషయానికి వస్తే.. ఆదిలాబాద్ 7, భద్రాద్రి కొత్తగూడెం 107, జీహెచ్ఎంసీ 171, జగిత్యాల 44, జనగామ 15, జయశంకర్ భూపాలపల్లి 42, గద్వాల 21, కామారెడ్డి 2, కరీంనగర్ 99, ఖమ్మం 149, మహబూబ్‌నగర్ 50, ఆసిఫాబాద్ 5, మహబూబాబాద్ 73, మంచిర్యాల 57, మెదక్ 11, మేడ్చల్ మల్కాజిగిరి 104, ములుగు 33, నాగర్ కర్నూల్ 25, నల్గగొండ 157, నారాయణపేట 9, నిర్మల్ 3, నిజామాబాద్ 21, పెద్దపల్లి 82, సిరిసిల్ల 36, రంగారెడ్డి 85, సిద్దిపేట 50, సంగారెడ్డి 40, సూర్యాపేట 86, వికారాబాద్ 25, వనపర్తి 35, వరంగల్ రూరల్ 27, వరంగల్ అర్బన్ 64, యాదాద్రి భువనగిరిలో 36 చొప్పున కేసులు నమోదయ్యాయి. 


Scroll to load tweet…