తెలంగాణలో కొత్తగా 173 కరోనా కేసులు నమోదవ్వగా.. ఒకరు మృతి చెందారు. 315 మంది వైరస్ నుంచి కోలుకోగా.. తెలంగాణలో ప్రస్తుతం 5,005 యాక్టివ్‌ కేసులు వున్నాయి 

తెలంగాణ రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 35,160 మందికి కరోనా నిర్థారణ పరీక్షలు నిర్వహించగా.. కొత్తగా 173 పాజిటివ్‌ కేసులు నమోదైనట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. వీటితో కలిపి తెలంగాణలో ఇప్పటివరకు కరోనా బారిన పడిన వారి సంఖ్య 6,94,564కి చేరింది. ఈ మేరకు వైద్య ఆరోగ్యశాఖ బులిటెన్‌ విడుదల చేసింది. నిన్న కోవిడ్ కారణంగా ఒకరు మృతి చెందారు. దీంతో మహమ్మారి కారణంగా రాష్ట్రంలో ఇప్పటి వరకు మరణించిన సంఖ్య 3,904కి చేరింది. వైరస్ నుంచి గడిచిన 24 గంటల్లో 315 మంది కోలుకున్నారు. ప్రస్తుతం తెలంగాణలో 5,005 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి.

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

ఇక జిల్లాల వారీగా కేసుల విషయానికి వస్తే.. ఆదిలాబాద్ 1, భద్రాద్రి కొత్తగూడెం 2, జీహెచ్ఎంసీ 64, జగిత్యాల 2, జనగామ 3, జయశంకర్ భూపాలపల్లి 0, గద్వాల 1, కామారెడ్డి 0, కరీంనగర్ 17, ఖమ్మం 6, మహబూబ్‌నగర్ 2, ఆసిఫాబాద్ 0, మహబూబాబాద్ 4, మంచిర్యాల 1, మెదక్ 2, మేడ్చల్ మల్కాజిగిరి 9, ములుగు 0, నాగర్ కర్నూల్ 0, నల్గగొండ 7, నారాయణపేట 0, నిర్మల్ 0, నిజామాబాద్ 2 , పెద్దపల్లి 3, సిరిసిల్ల 1, రంగారెడ్డి 13, సిద్దిపేట 1, సంగారెడ్డి 2, సూర్యాపేట 1, వికారాబాద్ 1, వనపర్తి 0, వరంగల్ రూరల్ 3, వరంగల్ అర్బన్ 18, యాదాద్రి భువనగిరిలో 2 చొప్పున కేసులు నమోదయ్యాయి.


Scroll to load tweet…