తెలంగాణలో కరోనా వైరస్ క్రమంగా అదుపులోకి వస్తోంది. గడచిన 24 గంటల్లో 1,24,430 కరోనా పరీక్షలు నిర్వహించగా కొత్తగా 1,417 మందికి పాజిటివ్‌గా తేలినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. అత్యధికంగా జీహెచ్ఎంసీ పరిధిలో 149, రంగారెడ్డి జిల్లాలో 104, ఖమ్మం జిల్లాలో 93 కేసులు వెల్లడయ్యాయి

తెలంగాణలో కరోనా వైరస్ క్రమంగా అదుపులోకి వస్తోంది. గడచిన 24 గంటల్లో 1,24,430 కరోనా పరీక్షలు నిర్వహించగా కొత్తగా 1,417 మందికి పాజిటివ్‌గా తేలినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. అత్యధికంగా జీహెచ్ఎంసీ పరిధిలో 149, రంగారెడ్డి జిల్లాలో 104, ఖమ్మం జిల్లాలో 93 కేసులు వెల్లడయ్యాయి. అత్యల్పంగా నిర్మల్ జిల్లాలో రెండు కేసులు గుర్తించారు.

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

24 గంటల వ్యవధిలో కొత్తగా 1,897 మంది కరోనా నుంచి కోలుకోగా, 12 మంది మరణించారు. వీటితో కలిపి తెలంగాణలో ఇప్పటి వరకు కోవిడ్‌తో ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 3,546కి చేరింది. రాష్ట్రంలో ఇప్పటి వరకు 6,10,834 మంది కోవిడ్ బారినపడగా.. 5,88,259 మంది కోలుకున్నారు. ప్రస్తుతం తెలంగాణలో 19,029 యాక్టివ్ కేసులు వున్నాయి.

ఇక జిల్లాల వారీగా కేసుల విషయానికి వస్తే.. ఆదిలాబాద్ 6, భద్రాద్రి కొత్తగూడెం 82, జీహెచ్ఎంసీ 149, జగిత్యాల 36, జనగామ 13, జయశంకర్ భూపాలపల్లి 32, గద్వాల 10, కామారెడ్డి 7, కరీంనగర్ 87, ఖమ్మం 93, మహబూబ్‌నగర్ 25, ఆసిఫాబాద్ 6, మహబూబాబాద్ 60, మంచిర్యాల 46, మెదక్ 16, మేడ్చల్ మల్కాజిగిరి 61, ములుగు 26, నాగర్ కర్నూల్ 17, నల్గగొండ 88, నారాయణపేట 8, నిర్మల్ 2, నిజామాబాద్ 10, పెద్దపల్లి 65, సిరిసిల్ల 26, రంగారెడ్డి 104, సిద్దిపేట 43, సంగారెడ్డి 22, సూర్యాపేట 85, వికారాబాద్ 23, వనపర్తి 37, వరంగల్ రూరల్ 24, వరంగల్ అర్బన్ 62, యాదాద్రి భువనగిరిలో 46 చొప్పున కేసులు నమోదయ్యాయి. 

Scroll to load tweet…