సంగారెడ్డి జిల్లా జరాసంఘం కేజీబీవీ స్కూల్‌లో కరోనా కలకలం రేగింది. ఇక్కడ చదువుకుంటున్న 12 మంది బాలికలకు పాజిటివ్‌గా తేలింది. 12 మంది బాధిత బాలికల్లో ముగ్గురిలో మాత్రమే లక్షణాలు కనిపించాయి.

రేపు పాఠశాలలో విద్యార్ధులు, టీచర్లకు అధికారులు కరోనా పరీక్షలు నిర్వహించనున్నారు. మరోవైపు తెలంగాణలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. శనివారం ఉదయం రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్ బులెటిన్ ప్రకారం.. తాజాగా 178 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.

దీంతో మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,98,631కి చేరింది. అదే సమయంలో 148 మంది కోలుకున్నారు. శుక్రవారం ఒక్కరోజే ఒకరు మృతి చెందారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా నమోదైన ఇప్పటివరకు 1,633 మంది ప్రాణాలు కోల్పోయారు.

రాష్ట్రంలో ప్రస్తుతం యాక్టివ్‌గా 1,939 కేసులు ఉండగా.. ఇప్పటివరకు 2,95,059 మంది కోలుకున్నట్లు డిశ్చార్జ్ అయినట్లు పేర్కొంది. రాష్ట్రంలో ఇప్పటివరకు 86,59,666 మంది కరోనా పరీక్షలు నిర్శహించినట్లు వెల్లడించింది