హైదరాబాద్ లో 12 కరోనా కంటైన్మెంట్ జోన్లు, ఎక్కడెక్కడంటే....
హైదరాబాద్ లో కరోనాపై పోరును మరింత సమర్థవంతంగా సలిపేందుకు, ఆ మహమ్మారిని సాధ్యమైనంత త్వరగా తరిమికొట్టేందుకు జిహెచ్ఎంసి జంటనగరాల పరిధిలో 12 కంటైన్మెంట్ క్లస్టర్లను గుర్తించింది.
హైదరాబాద్ లో కరోనాపై పోరును మరింత సమర్థవంతంగా సలిపేందుకు, ఆ మహమ్మారిని సాధ్యమైనంత త్వరగా తరిమికొట్టేందుకు జిహెచ్ఎంసి జంటనగరాల పరిధిలో 12 కంటైన్మెంట్ క్లస్టర్లను గుర్తించింది.
ప్రభుత్వ ఆదేశాల ప్రకారం వీటిని ఏర్పాటు చేసినట్టు, నమోదయిన కరోనా కేసుల్లో 89 కేసులు ఇక్కడే నమోదయినట్టు జిహెచ్ఎంసి కమీషనర్ లోకేష్ కుమార్ తెలిపారు. ఈ కరోనా కేసులు ఈ ప్రాంతాల్లో అధికంగా నమోదవడంతో ఈ ప్రాంతాలను పూర్తిగా సీల్ చేసేస్తున్నామని ఆయన తెలిపారు.
రాంగోపాల్ పేట్, షేక్ పేట్, రెడ్ హిల్స్, మలక్ పేట్ నుంచి సంతోష్ నగర్ వరకు, చాంద్రాయణగుట్ట, ఆల్వాల్, మూసాపేట్, కూకట్ పల్లి, కుత్బుల్లాపూర్ నుంచి గాజుల రామారం వరకు, మయూరి నగర్, యూసఫ్ గూడా, చందా నగర్ ప్రాంతాలను 12 కంటైన్మెంట్ క్లస్టర్లుగా గుర్తించినట్టు తెలిపారు.
ఈ ప్రాంతాలపై అధికారులు తీవ్ర దృష్టి పెట్టి ఈ ప్రాంతాలను మొత్తం త్వరితగతిన శానిటైజ్ చేస్తారని, ప్రజల కదలికలపై కూడా ఆంక్షలు విదేంచేందుకు యోచిస్తున్నామని, బ్యారికేడ్లు ఏర్పాటు చేస్తామని అధికారులు తెలిపారు.
ఇకపోతే తెలంగాణలో కరోనా కేసులు నమోదవుతూనే ఉన్నాయి. తెలంగాణలో తాజాగా 49 కేసులు నమోదైనట్లు ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ చెప్పారు. ఇప్పటి వరకు 397 యాక్టివ్ కేసులున్నట్లు ఆయన తెలిపారు. కొత్తగా కరోనా వైరస్ పాజిటివ్ వచ్చినవారిలో ఎవరు కూడా ఐసీయూలో లేరని ఆయన బుధవారం సాయంత్రం మీడియా సమావేశంలో చెప్పారు.
మొత్తం 453 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు ఆయన తెలిపారు. ఇప్పటి వరకు కరోనా వైరస్ వ్యాధికి చికిత్స పొంది 45 డిశ్చార్జి అయినట్లు ఆయన తెలిపారు. కరోనా నెగెటివ్ వచ్చినవాళ్లు కూడా ఇంట్లోనే క్వారంటైన్ లో ఉండాలని ఆదేశించినట్లు ఆయన తెలిపారు. ఇప్పటి వరకు 11 మంది మరణించినట్లు ఆయన తెలిపారు.
మర్కజ్ నుంచి వచ్చిన 1100 మందికి పరీక్షలు నిర్వహించామని, వారితో కాంటాక్ట్ అియన 3158 మందిని కూడా క్వారంటైన్ చేశామని ఆయన చెప్పారు. ఈ రోజు 500కు పైగా శాంపిల్స్ సేకరించినట్లు ఆయన తెలిపారు. 15 రోజుల్లో 1500 పడకల ఆస్పత్రిని సిద్ధం చేశామని ఆయన చెప్పారు.
రాష్ట్రంలో మందుల కొరత లేదని ఆయన చెప్పారు. తెలంగాణలో కొత్తగా కేసులు రాకపోవచ్చునని, త్వరలోనే ఉపశమనం లభిస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశఆరు.