తెలంగాణ (Telangana)లో కొత్తగా 105 కరోనా కేసులు (corona cases) నమోదవ్వగా.. వైరస్ వల్ల ఎవ్వరూ (corona deaths in telangana) మరణించలేదు. 106 మంది వైరస్ నుంచి కోలుకోగా.. తెలంగాణలో ప్రస్తుతం 3,973 యాక్టివ్‌ కేసులు వున్నాయి 

తెలంగాణలో (Telangana) గడిచిన 24 గంటల్లో 23,888 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా, 105 మందికి పాజిటివ్‌గా (corona cases) తేలినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ ప్రకటించింది. ఒకరోజు వ్యవధిలో జీహెచ్ఎంసీ పరిధిలోనే 59 కొత్త కేసులు నమోదు కాగా, రంగారెడ్డి జిల్లాలో 10 కేసులు గుర్తించారు. 17 జిల్లాల్లో కొత్త కేసులేవీ నమోదు కాలేదు. అదే సమయంలో 106 మంది కోవిడ్ నుంచి కోలుకోగా, ఈరోజు మరణాలేవీ నమోదు కాలేదు. తాజా కేసులతో కలిపి తెలంగాణలో ఇప్పటివరకు కరోనా బారిన పడినవారి సంఖ్య 6,73,574కి చేరుకుంది. రాష్ట్రంలో 6,65,861 మంది కోలుకున్నారు. తెలంగాణలో 3,740 యాక్టీవ్ కేసులుండగా.. ఇప్పటి వరకు రాష్ట్రంలో (corona deaths in telangana) కరోనాతో ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 3,973కి చేరింది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred

ఇక జిల్లాల వారీగా కేసుల విషయానికి వస్తే.. ఆదిలాబాద్ 3, భద్రాద్రి కొత్తగూడెం 0, జీహెచ్ఎంసీ 59, జగిత్యాల 1, జనగామ 0, జయశంకర్ భూపాలపల్లి 0, గద్వాల 1, కామారెడ్డి 0, కరీంనగర్ 5, ఖమ్మం 1, మహబూబ్‌నగర్ 1, ఆసిఫాబాద్ 0, మహబూబాబాద్ 1, మంచిర్యాల 1, మెదక్ 0, మేడ్చల్ మల్కాజిగిరి 6, ములుగు 0, నాగర్ కర్నూల్ 0, నల్గగొండ 4, నారాయణపేట 0, నిర్మల్ 0, నిజామాబాద్ 0, పెద్దపల్లి 0, సిరిసిల్ల 0, రంగారెడ్డి 10, సిద్దిపేట 2, సంగారెడ్డి 2, సూర్యాపేట 0, వికారాబాద్ 0, వనపర్తి 2, వరంగల్ రూరల్ 0, వరంగల్ అర్బన్ 6, యాదాద్రి భువనగిరిలో 0 చొప్పున కేసులు నమోదయ్యాయి.

Scroll to load tweet…