న్యూఢిల్లీ: తమ వినియోగదారులకు ప్రముఖ  చైనా ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల సంస్థ షావోమి సరికొత్త ఫీచర్లు ఉన్న రెండు ల్యాప్‌టాప్‌లను విడుదల చేసింది. షావోమి ఎంఐ నోట్‌బుక్ ఎయిర్ ల్యాప్‌టాప్‌, షావోమి ఎంఐ నోట్‌బుక్ ఎయిర్ 13.3 అంగుళాల ల్యాప్‌టాప్‌లను మార్కెట్‌లో ప్రవేశపెట్టింది. 8జీబీ ర్యామ్ వేరియంట్ షావోమి ఎంఐ నోట్‌బుక్ ఎయిర్ ట్యాప్‌టాప్, షావోమి ఎంఐ నోట్‌బుక్ ఎయిర్ ట్యాప్‌టాప్ రూ. 41,700 ధర పలుకుతోంది. రెండు ల్యాప్‌టాప్‌ల్లోనూ కోర్ ఐ3 చిప్ సెట్, విండోస్ 10 హోం ఎడిషన్ చేర్చారు.

15.6 అంగుళాల ఎంఐ నోట్‌బుక్ ఎయిర్ బేస్ మోడల్ 4జీబీ ర్యామ్, 128జీబీ స్టోరేజ్ గల ట్యాప్‌టాప్ రూ. 35,500 అందుబాటులో ఉంటుందని కంపెనీ తెలిపింది. ట్యాప్‌టాప్‌ల కోసం ప్రీ-ఆర్డర్స్ ప్రారంభమయ్యాయని, చైనా మార్కెట్‌లో నవంబర్ 11వ తేదీ నుంచి అమ్మకాలు ప్రారంభం అవుతాయని షావోమి సంస్థ పేర్కొంది.

13.3 అంగుళాల షావోమీ నోట్‌బుక్ 80.1 % స్రీన్, 170 డిగ్రీల వ్యూ యాంగిల్‌తో కూడిన హెచ్‌డీ రిసొల్యూషన్ డిస్ ప్లే కనిపిస్తుంది. ల్యాప్ టాప్ హెచ్డీ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 30 వాట్ల బ్యాటరీతోపాటు బ్లూటూత్ 4.1, ఫింగర్ ప్రింట్ సెన్సర్, వై-ఫై, యూఎస్బీ టైప్ సీ సపోర్ట్ కలిగి ఉంది.

ఇక 15.6 అంగుళాల మీ నోట్ బుక్ ఎయిర్ 178 డిగ్రీల వ్యూ యాంగిల్ తో కూడిన హెచ్ డీ రిసొల్యూషన్ డిస్ ప్టే ఉంటుంది. ఇందులోనూ ఇంటెల్ 8వ తరం కోర్ ఐ3 ప్రాసెసర్, డ్యుయల్ ఫ్యాన్, 2 ప్లస్ 2 హీట్ పైప్ తోపాటు ఒక టరా బైట్ సామర్థ్యం గల మైకానికల్ హార్డ్ డిస్క్ అదనంగా చేర్చవచ్చు. హెచ్డీఎంఐ, యూఎస్బీ 3.0, యూఎస్బీ టైప్ సీ, వైఫై సర్వీసులు అందుబాటులో ఉన్నాయి. 

రెడ్ మీ 6. 6ఏ ధరల పెంపు
ప్రముఖ స్మార్ట్‌ఫోన్ల సంస్థ షామీ ఇండియా తన చౌక మోడళ్లైన రెడ్‌మీ 6, రెడ్‌మీ 6ఏ ధరలను పెంచుతున్నట్లు ప్రకటించింది. వీటితోపాటు ఎంపిక చేసిన టీవీ, పవర్‌ బ్యాంక్‌ మోడళ్ల ధరలను సైతం పెంచినట్లు, రూపాయి పతనం కారణంగా ఉత్పత్తి వ్యయం గణనీయంగా పెరగడమే ఇందుకు కారణమని తన ట్విటర్‌ ఖాతాలో పేర్కొంది. 2జీ ర్యామ్‌, 16 జీబీ అంతర్గత మెమొరీ కలిగిన రెడ్‌మీ 6ఏను లాంచ్‌ చేసినప్పుడు రూ.5,999కు విక్రయించగా.. ప్రస్తుతం ధరను రూ.6,5999కు (రూ.600 పెంపు) పెంచింది. 32 జీబీ మెమొరీ సామర్థ్యం కలిగిన రెడ్‌మీ 6ఏ రేటును రూ.500 పెంచడంతో రూ.7,499కు చేరుకుంది. ఇక ఎంట్రీ లెవెల్‌ రెడ్‌మీ ధర రూ.7,999 నుంచి రూ.8,499కు పెంచింది. 3జీబీ ర్యామ్‌, 64 జీబీ మెమొరీ కలిగిన రెడ్‌మీ 6 రేటులో (రూ.9,499) మాత్రం మార్పులేదని తెలిపింది.