చైనాకు చెందిన ప్రముఖ ఎలక్ట్రానిక్ వస్తువుల తయారీ సంస్థ షియోమి భారత మార్కెట్లో సంచలనాలు సృష్టిస్తోంది. బడ్జెట్ ధరకే స్మార్ట్ ఫోన్లు, టీవీలను అందిస్తూ.. మన మార్కెట్లో ఇతర సంస్థలకు గట్టి పోటీ ఇస్తూ.. టాప్ లో దూసుకుపోతంది. ఈ కంపెనీ తాజాగా.. భారత మార్కెట్లో మరో  రెండు స్మార్ట్ టీవీలను విడుదల చేసింది. ఎంఐ ఎల్ఈడీ టీవీ 4ఎ ప్రొ 43, ఎంఐ ఎల్ఈడీ టీవీ4ఎక్స్ ప్రొ 554కె పేరుతో  ఈ టీవీలను విడుదల చేసింది. 

వీటి ధరలను బడ్జెట్ ధరలో కేటాయించింది. 43 ఇంచెస్ టీవీ ధర రూ.22,999గా నూ, 55 అంచుల టీవీ ధర రూ.39,999గా కంపెనీ ప్రకటించింది. ఫీచర్లు కూడా అదిరిపోయే రేంజ్ లో ఉన్నాయి. ఈ నెల 15వ తేదీ నుంచి వీటి బుకింగ్స్ ప్రారంభం కానున్నాయి. 

20 వాట్ల స్టీరియో స్పీక‌ర్లు, గూగుల్ వాయిస్ సెర్చ్,  షియోమి సొంతమైన ప్యాచ్‌ వాల్‌ ప్రధాన ఫీచ‌ర్లుగా కంపెనీ పేర్కొంది. ఇంకా ఆండ్రాయిడ్ 8.1 ఓరియో ఆధారిత ఆండ్రాయిడ్ టీవీ ఓఎస్‌ను ఈ టీవీల‌లో అందిస్తున్నారు. ప్లే స్టోర్‌, క్రోమ్ క్యాస్ట్‌కు స‌పోర్ట్‌, హాట్ స్టార్‌, హంగామా, సోనీ లివ్‌, వూట్‌, ఈరోస్ నౌ, జీ5, హూక్‌, ఎపిక్ ఆన్ వంటి యాప్‌లు ఇన్‌బిల్ట్‌గా ఈ స్మార్ట్‌ టీవీల్లో పొందుపర్చింది.