చైనా స్మార్ట్ ఫోన్ల దిగ్గజం ‘షియోమీ’ వాలెంటైన్స్ డే సేల్స్ ముగిసిన తర్వాత అమెజాన్ ఇండియా ద్వారా మరో ఆఫర్‌ను మొబైల్ ఫోన్ ప్రేమికుల కోసం అందుబాటులోకి తెచ్చింది. ‘వాలెంటైన్స్ డే’ సందర్భంగా ‘ఐ లవ్ మీ డేస్’పేరిట షియోమీ ఆఫర్ చేసిన గడువు ముగిసింది.

ఆ వెంటనే అమెజాన్ ఇండియా ద్వారా ‘షియోమీ మీ డే సేల్ పేరిట మరో ఆఫర్ ప్రకటించింది. ఈ నెల 19వ తేదీన మొదలైన ఈ ఆఫర్ ఈ నెల 23 వరకు అమలులో ఉంటుంది. రూ.2000 నుంచి రూ.4500 వరకు ఆఫర్లు లభిస్తున్నాయి.

ఈ సమయంలో ఆఫర్లతోపాటు ‘నో కాస్ట్ ఈఎంఐ’ ఆప్షన్ కూడా ఉంది. ఐసీఐసీఐ డెబిట్, క్రెడిట్ కార్డులపై కొనుగోలు చేసిన వారికి ఐదుశాతం ఇన్ స్టంట్ డిస్కౌంట్ అందజేస్తోంది. ఎక్స్చేంజ్ ఆఫర్‪తోపాటు ఎంపిక చేసిన మోడల్స్‌పై ఆఫర్లు ప్రకటించింది. ఆ ఆఫర్లేమిటో పరిశీలిద్దాం..

4జీబీ ప్లస్ 64 జీబీ స్టోరేజీ సామర్థ్యం గల షియోమీ ఆండ్రాయిడ్ వన్ స్మార్ట్ ఫోన్ ‘మీ ఎ2’రూ.13,999లకు లభిస్తోంది. దీనిపై రూ.2000 రాయితీ కల్సిస్తోంది.  ‘మీ ఎ2’ ఫోన్‌కు పాత ఫోన్‌ను ఎక్స్చేంజ్ ఆఫర్‌గానూ రూ.2000 ధర తగ్గించి విక్రయిస్తోంది.  6జీబీ ప్లస్ 128 జీబీ స్టోరేజీ వేరియంట్ ఫోన్ రూ.15,999లకే కొనుక్కోవచ్చు. 

రెడ్ మీ 6 ప్రో మోడల్ ఫోన్ 3జీబీ రామ్ ప్లస్ 32 జీబీ స్టోరేజీ వేరియంట్‌ ఫోన్ ధర రూ.8,999లకు విక్రయిస్తోంది. 4జీబీ ప్లస్ 64 జీబీ స్టోరేజీ ఫోన్ ధర రూ.10,999లకు లభిస్తుంది. పాత హ్యాండ్ సెట్‌పై రూ.7,416లకు అందిస్తోంది. 

సెల్ఫీ ఫోకస్డ్ రెడ్ మీ ‘వై2’3జీబీ ప్లస్ 32 జీబీ స్టోరేజీ వేరియంట్ ఫోన్ ధర ఇంతకుముందు రూ.10,499గా నిర్ణయించారు. పాత ఫోన్ ఎక్స్చేంజ్‌పై కస్టమర్లు రూ.7,087లకు కొనుగోలు చేయవచ్చు.

‘దేశ్ కా స్మార్ట్ ఫోన్’ నినాదంతో పేరొందిన  ఒక జీబీ రామ్ ప్లస్ 16 జీబీ వేరియంట్ ‘రెడ్ మీ 6ఎ’ ఫోన్ ధర రూ.5,999లకు, 2జీబీ ప్లస్ 32 జీబీ స్టోరేజీ ఫోన్ ధర రూ.6,499లకు లభిస్తుంది.