రేపే భారత మార్కెట్‌లోకి షియోమీ ‘మీ9’ప్లస్.. శామ్‌సంగ్ గెలాక్సీ ఎస్10 కూడా

బుధవారం వినూత్న ద్రుశ్యం ఆవిష్క్రుతం కానున్నది. న్యూఢిల్లీలో చైనా స్మార్ట్ ఫోన్ మేజర్ షియోమీ ‘మీ9’ ఫోన్ భారత విపణిలోకి ఆవిష్కరిస్తుండగా, దక్షిణ కొరియా దిగ్గజం శామ్ సంగ్ గెలాక్సీ ఎస్ 10 ఫోన్‌ను శాన్‌ఫ్రాన్సిస్కోలో ప్రవేశపెట్టనున్నది. 

Xiaomi Mi 9 Display Features Teased Ahead of February 20 Launch

చైనా స్మార్ట్ ఫోన్ మేజర్ షియోమీ ‘మీ9’ మోడల్ ఫోన్ బుధవారం భారత విపణిలోకి అడుగు పెట్టనున్నది. దీనికి సంబంధించిన టీజర్‌ను షియోమీ సీఈఓ లై జున్ ఇటీవలే సోషల్ మీడియాలో అప్ లోడ్ చేశారు. మరోవైపు బుధవారం సాయంత్రమే దక్షిణ కొరియా మేజర్ శామ్‌సంగ్ గెలాక్సీ ఎస్ 10 ఫోన్‌ను శాన్‌ఫ్రాన్సిస్కోలో మార్కెట్లోకి విడుదల చేయనున్నది. 

కాగా, శామ్‌సంగ్ అమోలెడ్ డిస్ ప్లే ప్యానెల్ విత్ గొరిల్లా గ్లాస్ 6 ప్రొటెక్షన్ కవర్ షియోమీ ‘మీ9’ ఫోన్ పైనా లభించనున్నదని తెలుస్తోంది. గతేడాది షియోమీ విడుదల చేసిన ‘మీ8’ మోడల్ ఫోన్ కంటే అత్యున్నతంగా ఉంటుందని లై జున్ సంకేతాలిచ్చారు.

గత ‘మీ8’ ఫోన్ కంటే ఫింగర్ ప్రింట్ సెన్సార్ 25 శాతం స్పీడ్‌గా ఉండనున్నది. షియోమీ ‘మీ9’కళ్లపై బ్లూ లైట్ ఇంపాక్ట్‌ను తగ్గించివేస్తుంది. ఈ మేరకు షియోమీ సీఈఓ లై జున్ తాజా టీచర్ ఫోటోలను చైనా సోషల్ మీడియా వేదిక ‘వైబో’లో పోస్ట్ చేశారు. 

అంతే కాదు శామ్ సంగ్ అమోలెడ్ డిస్ ప్లే మాదిరిగానే షియోమీ ‘మీ9’ 6.4 అంగుళాలతోపాటు ఫుల్ హెచ్‌డీ డిస్ ప్లే, 103.8 శాతం ఎన్టీఎస్సీ సూపర్ వైడ్ కలర్ గమట్, 600 నిట్స్ బ్రైట్ నెస్ కలిగి ఉంటుంది. సన్ లైట్ లెజిబిలిటీని విస్తరించేందుకు రెండో తరం సన్ స్క్రీన్ టెక్నాలజీని ఇందులో లోడ్ చేశారు. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios