వొడాఫోన్ ఐడియా వినియోగదారులకు ప్రత్యేకించి ఫీచర్ ఫోన్ యూజర్లకు పాత కాలం నాటి రూ.597 విలువైన ప్రీ ఫెయిడ్ ప్లాన్ అందుబాటులోకి తెచ్చింది. భారతీ ఎయిర్ టెల్, రిలయన్స్ జియో కూడా ఈ ప్లాన్లను తమ వినియోగదారులకు అందుబాటులోకి తెచ్చాయి. 

వొడాఫోన్‌ ఐడియా ప్రీ-పెయిడ్‌ వినియోగదారులకు శుభవార్త. తన ప్రీపెయిడ్‌ ప్లాన్‌లలో ఒకదానిని వొడాఫోన్‌ మరోసారి తిరిగి ప్రవేశపెట్టింది. రూ.597తో రీఛార్జ్‌ చేసుకుంటే 168 రోజుల పాటు అపరిమిత వాయిస్‌ కాల్స్‌ పొందొచ్చు.

ఈ ఆఫర్ ఫీచర్ ఫోన్లు, స్మార్ట్ ఫోన్ల వినియోగదారులకు అందుబాటులోకి వస్తుంది. అదే విధంగా రోజూ 100 ఎస్‌ఎంఎస్‌లతో పాటు, ఆఫర్‌ కాలంలో మొత్తం 10జీబీ 4జీ డేటాను పొందవచ్చని వొడాఫోన్‌ తెలిపింది. రెగ్యులర్ యూజర్లకు ఈ ప్లాన్ ఈ ఆఫర్‌ కాలపరిమితి 112 రోజుల్లో ముగుస్తుంది. 

తాజా ఆఫర్‌ కింద వినియోగదారులు రోజుకు 250 లోకల్‌, ఎస్టీడీ కాల్స్‌ చేసుకోవచ్చు. అంటే 4 గంటల 10 నిమిషాల పాటు టాక్‌టైమ్‌ లభిస్తుంది. అదే విధంగా వారానికి కేవలం 1000 నిమిషాలు మాత్రమే వినియోగించుకునే వీలుంది.

వొడాఫోన్‌ అన్ని 4జీ సర్కిళ్లకూ ఈ ఆఫర్‌ వర్తిస్తుంది. త్వరలో వొడాఫోన్ 4జీ కస్టమర్లకు త్వరలో రూ.159 విలువైన ఆఫర్ అందిస్తోంది. ఈ ఆఫర్ కింద రోజూ ఒక జీబీ డేటా, 100 ఫ్రీ ఎస్సెమ్మెస్‌లు అందజేస్తోంది. 

వొడాఫోన్ ప్రతిపాదించిన రూ.597 ప్రీ పెయిడ్ ప్లాన్.. రిలయన్స్ జియో మాన్ సూన్ హంగామా ఆఫర్ కింద ప్రకటించిన రూ.594 ప్లాన్‌తో సరిపోలుతుంది. అలాగే భారతీ ఎయిర్ టెల్ రూ.597 విలువైన ప్రీ పెయిడ్ ఆపర్‌తోనూ వొడాఫోన్ తాజా ఆఫర్ సమకాలీనంగా ఉంటుంది. భారతీ ఎయిర్ టెల్ తాజా ఆఫర్‌తో రోజూ 100 ఎస్సెమ్మెస్‌లు, 10జీబీ డేటా పొందొచ్చు.

తాజాగా వొడాఫోన్ ప్రకటించిన ప్రీ పెయిడ్ ప్లాన్ తోపాటు నూతన ప్రీ పెయిడ్ ఆఫర్ ప్రకారం రోజూ 1.5 జీబీ పొందొచ్చు. రూ.209 విలువైన ఆఫర్ పై 28 రోజులు, రూ.479 ఆఫర్ ప్లాన్‌పై 84 రోజులు, రూ.529 ప్లాన్‌పై 90 రోజుల పాటు అన్ లిమిటెడ్ కాల్స్, ఎస్సెమ్మెస్‌లు ఉచితంగా చేసుకోవచ్చు.