తెలుగు రాష్ట్రాల మార్కెట్లోకి వివో వై95: ధర రూ.16,690లకే

చైనా స్మార్ట్ ఫోన్ల దిగ్గజం వివో ప్రజలకు బడ్జెట్ స్మార్ట్ ఫోన్ అందుబాటులోకి తెచ్చింది. దీని ధర రూ.16,690. తాము స్మార్ట్ ఫోన్ల విక్రయంలో భారతదేశంలో రెండో స్థానంలో ఉన్నామని సంస్థ భారత్ బ్రాండ్ స్ట్రాటర్జీ డైరెక్టర్ నిపుణ్ మౌర్య చెప్పారు.
 

Vivo launches budget smart phone 'Y95' with 6.2 inch screen, 4030mAh battery

స్మార్ట్‌ఫోన్ల సంస్థ వివో తన కొత్త వై95 మోడల్‌ ఫోన్ తెలుగు రాష్ట్రాల మార్కెట్లోకి ప్రవేశించింది. దీని ధర రూ.16,990. ఈ ఫోనుతో రూ.20వేల లోపు విభాగంలో తన మార్కెట్‌ వాటా మరింత పెరుగుతుందని వివో భావిస్తోంది.

నలుపు, నెబ్యులా పర్పుల్‌ రంగుల్లో ఇది లభించనుంది. వివో స్టోర్లు, ఇతర మొబైల్‌ విక్రయ కేంద్రాలు, ప్రముఖ ఆన్‌లైన్‌ ఈ కామర్స్‌ వెబ్‌సైట్లలో ఇది అందుబాటులో ఉంటుందని వివో ఇండియా బ్రాండ్‌ స్ట్రాటజీ డైరెక్టర్‌ నిపుణ్ మార్య తెలిపారు.

మంగళవారం హైదరాబాద్‌లో జరిగిన కార్యక్రమంలో ఈ ప్రాంతీయ విపణిలోకి విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశీయ స్మార్ట్‌ఫోన్ల విభాగంలో 17.61శాతం మార్కెట్‌ వాటాతో ద్వితీయ స్థానంలో ఉన్నట్లు పేర్కొన్నారు. రూ.20వేలు- రూ.30వేల విభాగంలో మొదటి స్థానంలో కొనసాగుతున్నామని చెప్పారు. 

తెలంగాణలో 17శాతం మార్కెట్‌ వాటా ఉందనీ, ఇక్కడ మూడో స్థానంలో కొనసాగుతున్నట్లు తెలిపారు. తెలంగాణ వ్యాప్తంగా 1,500 స్టోర్లలో వివో మొబైల్ ఫోన్లు అందుబాటులో ఉన్నాయనీ, 15 సర్వీస్‌ కేంద్రాలు ఉన్నట్లు తెలిపారు.

అవసరాన్ని బట్టి, వీటి సంఖ్య పెంచేందుకు ప్రయత్నిస్తున్నామని అన్నారు. సమీప భవిష్యత్‌లో ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ తో కూడిన స్మార్ట్ వాచెస్ వంటి ఉత్పత్తులను అందుబాటులోకి తెస్తామని నిపుణ్ మౌర్య చెప్పారు. 

6.22 అంగుళాల డిస్ ప్లే, 4జీబీ ర్యామ్‌, 64 జీబీ ఇంటర్నల్ మెమొరీ సామర్థ్యం ఇందులో ఉంది. ఫ్రంట్ 20 మెగాపిక్సెల్‌, వెనక వైపు 13+2 మెగా పిక్సెల్‌ కెమేరాలున్నాయి. బ్యాటరీ సామర్థ్యం 4030ఎఏహెచ్‌. పేటీఎంతో కొనుగోలు చేసిన వారికి రూ.1,500 వరకూ క్యాష్ బ్యాక్ ఆఫర్ అందుబాటులో ఉందని వివో ప్రకటించింది. రిలయన్స్‌ జియో నుంచి రూ.4వేల విలువైన 3 టీబీ డేటా ఉచిత ఆఫర్‌గా లభిస్తుంది.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios