డిజిటల్ విక్రయాల్లో ఫ్యాషన్.. స్మార్ట్ ఫోన్లపైనే మోజు
భారతీయుల్లో అత్యధికులు ఆన్ లైన్ సేవల వైపే మొగ్గు చూపుతున్నారు. ఇటీవలి కాలంలో ఆన్‌లైన్‌లో ఫ్యాషన్ వస్త్రాలు, మొబైల్ ఫోన్లతోపాటు ఐటీ ఉత్పత్తులు, ట్రావెల్ టికెట్లతోపాటు నిత్యం ఇంట్లో ఉపయోగించే గ్రోసరీ వస్తువులు కూడా భారీగా హాట్ కేకుల్లా అమ్ముడవుతున్నాయని నీల్సన్ సర్వే తేల్చింది.
భారతీయుల్లో అత్యధికులు ఆన్ లైన్ సేవల వైపే మొగ్గు చూపుతున్నారు. ఇటీవలి కాలంలో ఆన్‌లైన్‌లో ఫ్యాషన్ వస్త్రాలు, మొబైల్ ఫోన్లతోపాటు ఐటీ ఉత్పత్తులు, ట్రావెల్ టికెట్లతోపాటు నిత్యం ఇంట్లో ఉపయోగించే గ్రోసరీ వస్తువులు కూడా భారీగా హాట్ కేకుల్లా అమ్ముడవుతున్నాయని నీల్సన్ సర్వే తేల్చింది.
గత రెండేళ్లలో ఈ- కామర్స్ సంస్థలు దేశీయ ఎఫ్‌ఎంసీజీ విభాగంలో తమ వాటాను మూడు రెట్లు పెంచుకోవడంతోనే ఆన్‌లైన్ షాపింగ్‌కు గల డిమాండ్‌ను తెలియజేస్తోందని ‘2018 నీల్సన్ కనెక్టెడ్ కామర్స్ రిపోర్ట్’ను నీల్సన్ విడుదల చేసింది.
ఇంటర్నెట్ అనుసంధానత కలిగిన వారిలో 98 శాతం మంది ఆన్‌లైన్‌లో ఉత్పత్తులను కొనుగోళ్లు చేస్తున్నట్టు నీల్సన్ సంస్థ అధ్యయనంలో తెలిసింది. ఇక ఆన్‌లైన్ అమ్మకాల్లో ట్రావెల్ (69 శాతం), ఫ్యాషన్ (66 శాతం), ఐటీ/ మొబైల్ ఫోన్ల(63 శాతం)కు అతి పెద్ద వాటా లభిస్తోంది. వీటితోపాటు ప్యాకేజ్డ్ గ్రోసరీ ఉత్పత్తులు గణనీయమైన వృద్ధిని నమోదు చేశాయి.
40 శాతం మంది కస్టమర్లు తాజా గ్రోసరీ ఉత్పత్తులు, శిశు, చిన్నారుల ఉత్పాదనలను కొనుగోలు చేశామని నీల్సన్ సర్వేలో తెలిపారు. ఆన్‌లైన్ కొనుగోళ్లు ఎన్నో విభాగాల్లోకి విస్తరించగా, తాజా, ప్యాకేజ్డ్ ఆహార ఉత్పత్తులపై ఎక్కువ మందిలో ఆసక్తి పెరిగింది. గత రెండేళ్లలో అంతర్జాతీయ ఆన్‌లైన్ గ్రోసరీ కొనుగోళ్లు 15 శాతం పెరిగాయి. ఫ్రెషన్ గ్రాసరీ కొనుగోళ్లు 41 శాతం పెరిగాయి.
తొలిసారి ఆన్‌లైన్ షాపింగ్ చేసే వారు ట్రావెల్, ఫ్యాషన్, ఐటీ/ మొబైల్ ఉత్పత్తులను ఎంచుకుంటున్నారని నీల్సన్ దక్షిణాసియా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సమీర్ శుక్లా చెప్పారు. ఒకసారి అలవాటై నమ్మకం పెరిగిన తర్వాత సౌందర్య, వ్యక్తిగత సంరక్షణ, చిన్నారుల ఉత్పత్తుల విభాగాల్లోకి వారి కొనుగోళ్లు విస్తరిస్తున్నాయని తెలిపారు.
కొనుగోళ్ల పరిమాణం పెరిగినా, భారత్‌లో ఆన్‌లైన్ కొనుగోళ్లు చేసే వారి శాతం 2018లో తగ్గిందని నీల్సన్ దక్షిణాసియా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సమీర్ శుక్లా తెలిపారు. వచ్చే సంవత్సరాల్లో ఆన్‌లైన్ షాపింగ్‌లో ఎన్నో విభాగాల్లో కొనుగోళ్లకు భారీ అవకాశాలు ఉన్నాయని వివరించారు. నాణ్యత పరమైన భరోసా ఇస్తే ఆన్‌లైన్‌లో తాజా, ప్యాకేజ్డ్ గ్రోసరీ ఉత్పత్తుల కొనుగోళ్లకు వినియోగదారులు మరింత ముందుకు వస్తారని పేర్కొన్నారు.