ప్రపంచంలోనే మొట్టమొదటి ఫోల్డింగ్‌ స్మార్ట్‌ఫోన్‌ను చైనా కంపెనీ రాయొలే కార్పొరేషన్‌ విడుదల చేసింది.  కొంతకాలంగా  ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్‌ను తెచ్చేందుకు శాంసంగ్‌, ఎల్‌జీ, హువావే లాంటి సంస్థలు ప్రయత్నాలు చేస్తున్నాయి.

ఈ క్రమంలో చైనా కంపెనీ పైచేయి సాధించి స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థలను ఆశ్చర్యంలో ముంచెత్తింది. వచ్చేనెల వినియోగదారులకు అందుబాటులోకి రానున్న ఈ ‘ఫ్లెక్స్‌పై’ ఫోన్‌ను రాయొలే కార్పొరేషన్‌ బీజింగ్‌లో అక్టోబర్‌31న ఈ ఫోన్‌ను తొలిసారిగా మార్కెట్లోకి తీసుకొచ్చింది.

‘ఫ్లెక్స్‌పై’ పేరుతో తీసుకొచ్చిన ఈ ఫోన్‌ను మార్కెట్‌లో లాంచ్‌ చేసింది. చూడటానికి ట్యాబ్లెట్‌లా కనిపించినా.. మధ్యలోకి ఫోల్డ్‌ చేసే వాడుకునేలా దీన్ని రూపొందించింది రాయులే. ఇందులో మరో విశేషమేమంటే ఫోన్ వెనుక భాగాన రెండు కెమెరాలు ఉంటాయి. ఫోన్‌ మడిచినపుడు ఒక కెమెరా  సెల్ఫీ కెమెరాగా ఉపయోగపడుతుంది. 

7.8 అంగుళాలతో మినీ ట్యాబ్‌లా ఉండే ఈ ఫోన్‌ను సగానికి మడతబెట్టొచ్చు. మడిచిన తర్వాత ఇది డ్యుయల్‌ స్క్రీన్‌ స్మార్ట్‌ఫోన్‌లా కనిపిస్తుంది. ఫ్లెక్స్‌ పై గా  పిలుస్తున్న ఈ ఫోన్‌ 20మెగాపిక్సెల్‌ టెలిఫొటో లెన్స్‌తో పాటు 16ఎంపీ  వైడ్‌ యాంగిల్‌ లెన్స్‌ డ్యుయల్‌ కెమెరాలు ఇందులో ఉన్నాయి.

దాదాపు 2రెండు లక్షల సార్లు పరీక్షించి ఈ ఫోన్‌ను మార్కెట్లోకి విడుదల చేశామని కంపెనీ ప్రకటించింది. సంప్రదాయ స్మార్ట్‌ఫోన్లతో  పోలిస్తే తమ ఫోల్డబుల్‌ ఫోన్లు వినియోగదారులకు వివాత్మక, విభిన్నమైన అనుభవాన్నందిస్తుందని  రాయొలే సీఈవో, వ్యవస్థాపకుడు డాక్టర్ బిల్ లియూ అన్నారు.

7.8 అంగుళాల అమోలెడ్ డిస్‌ప్లే, 7ఎన్ఎం స్నాప్‌డ్రాగన్ 8150 ‘ఫ్లెక్సీ పై’ 6జీబీ/128 జీబీ, 8జీబీ/256 జీబీ వేరియంట్లలో అందుబాటులో ఉంది. ఇందులో 16 ఎంపీ+ 20 ఎంపీ డ్యూయల్ కెమెరా ఉంది. ఫోన్ మమాలుగా ఉన్నప్పుడు ఇది ఫ్రంట్ కెమెరాగా, మడతబెట్టినప్పుడు రియర్ కెమెరాగా పనిచేస్తుంది.

3,800 ఎంఏహెచ్ సామర్థ్యం కలిగిన బ్యాటరీని ఉపయోగించారు. ఇంకా క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 8150 ప్రాసెసర్ కూడా అమర్చారు. ఈ ఫోన్లు డిసెంబర్ నుంచి చైనాలో పూర్తి స్థాయిలో అందుబాటులోకి రానున్నట్లు సంస్థ తెలిపింది.

ఫోన్‌ తెరపై దృశ్యం ఏళ్ల పాటు ఏ అవాంతరం లేకుండా కనిపిస్తుందని సంస్థ వెల్లడించింది. ఈ ఫోన్‌ను 6జీబీ+128జీబీ, 8జీబీ+256జీబీ, 8జీబీ+జీబీ వేరియంట్లలో రాయులే విడుదల చేసింది.

royole.com/flexpai ద్వారా ఈ ఫోన్‌ ప్రీ ఆర్డర్లు ప్రారంభమయ్యాయి.128జీబీ ఇంటర్నల్‌ ఇంటర్నల్‌ స్టోరేజీ ఫోన్‌ ధర1,318 డాలర్లు, (సుమారు రూ.94,790) 256జీబీ స్టోరేజీ వేరియంట్‌ ధర 1,469 డాలర్లుగా (లక్షా డెబ్భై వేల రూపాయలు) నిర్ణయించింది.

డిసెంబరులో ఈ ఫోన్ల డెలివరీ చేయనున్నారట. ఇక  ఈ అమేజింగ్‌ ఫోన్‌  భారత మార్కెట్లో లాంచింగ్‌ కోసం మరికొంత కాలం వేచి చూడాల్సిందే. మరోవైపు శాంసంగ్‌, ఎల్‌జీ కంపెనీలు వచ్చే ఏడాది జనవరిలో ఫోల్డింగ్‌ ఫోన్‌ ఆవిష్కరించనున్నాయని భావిస్తున్నారు.