రెడ్‌మీ జోరుకి బ్రేక్: శామ్‌సాంగ్ గెలాక్సీ ఎం సిరీస్‌కు ఎగబడుతున్న జనం
ఏడాది క్రితం వరకు స్మార్ట్ ఫోన్ల రారాజుగా ఉన్న దక్షిణ కొరియా దిగ్గజం శామ్‌సంగ్ తిరిగి ఈ ఏడాది ఆ స్థానం పొందేందుకు మార్కెట్లో తన వాటా పెంచుకునేందుకు వేగంగా కదులుతోంది. మధ్యతరగతి ప్రజలకు బడ్జెట్ ధరలో ఎం సిరీస్ ఫోన్లను అందుబాటులోకి తేవడంతోపాటు గెలాక్సీ ఎస్9 ప్లస్ మోడల్ ఫోన్ల ధరలు రూ.7000 శాశ్వతంగా తగ్గించి వేసింది. కాకుంటే ఇది ఆన్ లైన్ కొనుగోళ్లకే పరిమితం.
దక్షిణ కొరియా స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ శామ్‌సంగ్ తాజాగా మార్కెట్లోకి తెచ్చిన గెలాక్సీ స్మార్ట్ ఫోన్లకు వినియోగదారుల నుంచి భారీ డిమాండ్ వస్తోంది. గత మంగళవారం విడుదల చేసిన గెలాక్సీ ఎం స్మార్ట్‌ఫోన్లు ఫస్ట్ సేల్‌లోనే రికార్డు స్థాయిలో అమ్ముడు పోయాయి. అంతేకాదు స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో దూసుకుపోయేందుకు శామ్‌సంగ్ కొత్త ప్రణాళికలతో వస్తోంది.
అమెజాన్, శామ్‌సంగ్ వెబ్ సైట్లకు పోటెత్తిన కస్టమర్లు
లక్షల మంది వినియోగదారులు శామ్‌సంగ్ గెలాక్సీ ఎం10, ఎ20 ఫోన్లను సొంతం చేసుకునేందుకు అమెజాన్, శామ్‌సంగ్ వెబ్‌సైట్లకు పోటెత్తారు. దీంతో క్షణాల్లోనే ఫోన్లు అమ్ముడుపోయాయి. శామ్‌సంగ్‌పై ప్రేమాభిమానులు కురిపించి, తమకు మద్దతు తెలిపినందుకు శామ్‌సంగ్ కృతజ్ఞతలు తెలిపింది.
శామ్‌సంగ్ గెలాక్సీ ఎం సిరీస్‌లో బోల్డ్ స్పెషాలిటీస్
ఎన్ని ఫోన్లు అమ్ముడుపోయాయి, సేల్ ఎంతకాలం కొనసాగుతుందన్న విషయాన్ని మాత్రం శామ్‌సంగ్ వెల్లడించలేదు. గెలాక్సీ ఎం సిరీస్ ఫోన్లలో ఇన్ఫినిటీ-వి డిస్‌ప్లే, అతి పెద్ద బ్యాటరీ, 3 రెట్లు వేగవంతమైన చార్జింగ్ వంటి ప్రత్యేకతలున్నాయి. గెలాక్సీ ‘ఎం 20’ లో 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉపయోగించగా, ‘ఎం10’లో 3,400 ఎంఏహెచ్ బ్యాటరీని ఉపయోగించారు.
శామ్‌సంగ్ గెలాక్సీ ఎం సిరీస్ ఫోన్ ధరలిలా..
గెలాక్సీ ఎం10లోని 2జీబీ ర్యామ్/16 జీబీ స్టోరేజీ వేరియంట్ ధర రూ.7,990 కాగా, 3జీబీ ర్యామ్/32 జీబీ వేరియంట్ ధర రూ.8,990. గెలాక్సీ ఎం20 లోని 3జీబీ ర్యామ్/32 జీబీ స్టోరేజీ వేరియంట్ ధర రూ.10,990 కాగా, 4జీబీ ర్యామ్/64 జీబీ వేరియంట్ ధర రూ.12,990. కాగా, గెలాక్సీ ఎం సిరీస్ ఫోన్ల తర్వాతి సేల్ ఈ నెల 7న మధ్యాహ్నం 12 గంటలకు ప్రారంభం కానుంది.
ఇలా గెలాక్సీ ఎస్9ప్లస్ ఫోన్లపై శాశ్వత ధరలు
శామ్‌సంగ్ తన ఫ్లాగ్‌షిప్ ఫోన్ ‘గెలాక్సీ ఎస్9ప్లస్’లపై శాశ్వత తగ్గింపు ధరలను ప్రకటించింది. ఎస్9ప్లస్ అన్ని వేరియంట్లపై రూ.7వేల మేరకు తగ్గింపు అందుబాటులోకి తెచ్చింది. అయితే ఈ తగ్గింపు ఆన్‌లైన్ విక్రయాలకు మాత్రమే వర్తించనుంది.
శామ్‌సంగ్ ఫోన్లపై తగ్గింపు ధరలివి..
గెలాక్సీ ఎస్9 + 64జీబీ స్టోరేజ్ వేరియంట్ మోడల్ ఫోన్ ధర లాంచింగ్ ధర రూ. 64,900కాగా, రూ. 57,900లకు లభిస్తుంది. 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ఫోన్ ధర రూ. 68,900 కాగా, రూ 61,900లకు అందుబాటులో ఉంటుంది. 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ ఫోన్ ధర 72,000 కాగా, రూ 65,900లకే విక్రయిస్తోంది.
హెచ్‌డీఎఫ్‌సీ క్రెడిట్ కార్డుపై క్యాష్ బ్యాక్ ఆఫర్
శామ్‌సంగ్ ఆన్‌లైన్ అందించిన సమాచారం ఇతర ఆఫర్లు కూడా ఉన్నాయి. ముఖ్యంగా హెచ్‌డీఎఫ్‌సీ క్రెడిట్ కార్డు కొనుగోళ్లపై రూ.4వేల క్యాష్‌బ్యాక్ అందిస్తోంది. అలాగే రూ. 9వేల దాకా ఎక్స్చేంజ్ ఆఫర్ కూడా ఉంది. కాగా గెలాక్సీ ఎస్ 9ప్లస్‌ను గత ఏడాది ఇండియాలో లాంచ్ చేసిన సంగతి తెలిసిందే.